- Telugu News Photo Gallery Cinema photos Tollywood star heroes who are showing their power in Bollywood
Bollywood: అక్కడ కూడా మన డామినేషనే.. బాలీవుడ్‌లోనూ టాలీవుడ్ జెండా రెపరెపలు..
మనం లేకపోతే ఏం నడవదురా.. మనదే ఇదంతా..! ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో అది అద్భుతం అంతే అంటున్నారు మన హీరోలు. అక్కడ కూడా మన డామినేషనే అంటావా అన్నట్లు.. బాలీవుడ్‌లోనూ టాలీవుడ్ జెండా ఎగిరేలా చేస్తున్నారు మనోళ్లు. పాన్ ఇండియన్ మార్కెట్ ఓపెన్ అయ్యాక.. నార్త్ హీరోలకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు మన హీరోలు. అదెలాగో ఈ స్టోరీ చూసేయండి తెలుస్తుంది.
Updated on: Jul 15, 2024 | 4:00 PM

పాన్ ఇండియన్ ట్రెండ్ మొదలయ్యాక బాలీవుడ్ హీరోలకు తెలియని వణుకు మొదలైపోయింది. వాళ్ళ స్థానాన్ని మన హీరోలు కబ్జా చేస్తున్నారనే విషయం వాళ్ళకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అయినా కూడా వాళ్లు ఏం చేయలేకపోతున్నారు. పైగా బాలీవుడ్ బడా దర్శకులు కూడా మన హీరోలే కావాలంటున్నారు.. మన వాళ్ళతోనే సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.

సౌత్, నార్త్ వర్కవుట్ అయ్యేలా పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ సినిమా చేయాలంటే టాలీవుడ్ స్టార్ హీరోలను మించిన ఆప్షన్ మరోటి బాలీవుడ్ దర్శకులకు కనిపించడం లేదు. అందుకే ఆదిపురుష్ ఏరికోరి ప్రభాస్‌తో చేసారు ఓం రౌత్. ప్రభాస్ కోసమైతే క్యూ కడుతున్నారు బాలీవుడ్ మేకర్స్. ఆయన డేట్స్ ఇస్తే చాలు అనుకుంటున్నారు.

ఇక ఇప్పుడు నార్త్‌లో ఉన్న స్టార్స్ అందరినీ కాదని.. వార్ 2 కోసం హృతిక్ రోషన్‌కు పోటీగా జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకున్నారు అయన్ ముఖర్జీ. ప్రస్తుతం ఈ సినిమా చిత్రకరణ దశలో ఉంది. త్వరలోనే పూర్తి కానుంది.

మరోవైపు అల్లు అర్జున్ పుష్ప పూర్తి చేస్తే.. ముంబైకి కిడ్నాప్ చేసేలా ఉన్నారు అక్కడి నిర్మాతలు. రామ్ చరణ్ కూడా ఏం తక్కువ కాదు.. ఈయన కోసం ఏకంగా సంజయ్ లీలా భన్సాలీ కథ సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

11వ శతాబ్దపు రాజు సుహేల్ దేవ్ బయోపిక్‌ను చరణ్‌తో భన్సాలీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. పీరియాడిక్ సినిమాలు చేయడంలో భన్సాలీకి తిరుగులేదు. చరణ్‌తోనూ ఇలాంటి భారీ పీరియాడిక్ మూవీనే ప్లాన్ చేస్తున్నారు ఈ దర్శకుడు. పదేళ్ళ కిందే జంజీర్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చరణ్.. ట్రిపుల్ ఆర్‌తో మార్కెట్ పెంచుకున్నారు.




