- Telugu News Photo Gallery Cinema photos Comedians are doing films as hero and making huge collection
Comedian Heroes: కమెడియన్లుతోనూ కలెక్షన్ల వర్షం.. హీరోలుగా సినిమాలకు సిద్ధం..
కమెడియన్లతో సినిమాలు తీస్తే కలెక్షన్లు వస్తాయా..? వాళ్లను హీరోలుగా పెడితే ఆడియన్స్ చూస్తారా..? ఇలా ఎన్నో అనుమానాలుంటాయి నిర్మాతల్లో. కానీ కొందరు మాత్రం అలాంటి రిస్కులే చేస్తుంటారు. ఏం వాళ్లకేం తక్కువ.. కమెడియన్లు హీరోలైతే కలెక్షన్లు రావా అంటూ అటువైపే వెళ్తున్నారు. టాలీవుడ్‌లో ఈ మధ్య హాస్యనటులే కథానాయకులుగా మారుతున్నారు.
Updated on: Jul 15, 2024 | 3:30 PM

కమెడియన్లు హీరోలు కావడం కొత్తేం కాదు. అప్పట్లో రేలంగి, రాజబాబు నుంచి.. నిన్నటి బ్రహ్మానందం, అలీ మీదుగా.. నేటి సునీల్ వరకు ఎంతోమంది కమెడియన్లు హీరోలుగా నటించారు.. మెప్పించారు కూడా. ఈ జనరేషన్‌లో కూడా ఇదే కంటిన్యూ అవుతుంది.

ప్రియదర్శి ఇప్పటికే మల్లేశం, బలగం లాంటి సినిమాలతో హీరోగా ప్రూవ్ చేసుకున్నారు కూడా. ప్రియదర్శి హీరోగా వరస సినిమాలు చేస్తున్నారిప్పుడు. ఈయన నటిస్తున్న డార్లింగ్ జులై 19న విడుదల కానుంది. నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విన్ రామ్ తెరకెక్కిస్తున్నారు.

ఇక సత్యం రాజేష్ సైతం పొలిమేర ఫ్రాంచైజీతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. వంశీ నందిపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. తాజాగా పొలిమేర 3 ప్రకటించారు.

సుహాస్ కూడా కమెడియన్‌గానే వచ్చారు. కానీ కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజిపేట మ్యారేజ్ బ్యాండ్ అంటూ వరస విజయాలతో హీరోగా దూసుకుపోతున్నారు. స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా ఈ మధ్యే చారి 111 సినిమాతో హీరోగా మారారు. ఇక శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే మరో సినిమాలోనూ హీరోగా నటిస్తున్నారు వెన్నెల కిషోర్.

ఈ నగరానికి ఏమైందిలో మస్త్ షేడ్స్ ఉన్నాయిరా నీలో అనే డైలాగ్‌తో ఫేమస్ అయిన అభినవ్ గోముటం హీరోగా మస్త్ షేడ్స్ ఉన్నాయిరా అనే పేరుతోనే ఓ సినిమా వచ్చింది. అజయ్ ఘోష్‌తో మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమా చేసారు కొత్త దర్శకుడు శివ పాలడుగు. ఇక వైవా హర్ష హీరోగా రవితేజ సుందరం మాస్టార్ అనే సినిమా నిర్మించారు.




