- Telugu News Photo Gallery Cinema photos Tollywood makers say that there is no compromise on the budget of films
Tollywood Updates: బడ్జెట్ విషయంలో నో కాంప్రమైజ్.. నేషనల్ రేంజ్‌కి మన హీరోలు..
గల్లీల్లో సిక్స్ ఎవరైనా కొడతారు. కానీ, స్టేడియంలో కొట్టేవారికే ఓ రేంజ్ ఉంటుంది... ఏంటీ.. ఈ డైలాగ్‌ని ఎక్కడో విన్నట్టుందే అనుకుంటున్నారా? యస్.. డార్లింగ్ చెప్పిన మాటే. కాకపోతే, ఇప్పుడు ఈ మాట ఆయన ఒక్కడికే కాదు.. నేషనల్ రేంజ్ దాటేస్తున్న మన హీరోలు చాలా మందికి వర్తిస్తుంది.
Updated on: Apr 26, 2025 | 1:45 PM

యంగ్ రెబల్‌స్టార్ నటిస్తున్న సినిమా ఫౌజీ. పీరియాడిక్ సినిమాగా తెరకెక్కుతోంది. ఈ మూవీతో కొత్త భామ ఇమాన్ ఇస్మాయిల్ ఇండస్ట్రీకి పరిచయం కానుంది. మూవీ బడ్జెట్ ఎంతా? అని అడిగితే 600 కోట్ల దాకా పెడుతున్నారనే మాట వినిపిస్తోంది.

సేమ్ ఫిగర్ అల్లు అర్జున్ మూవీ విషయంలోనూ వినిపిస్తోంది. ఆఫ్టర్ పుష్ప సీక్వెల్ తెరకెక్కుతున్న సినిమా కావడం, స్టోరీ డిమాండ్ చేయడంతో బన్నీ కోసం 600 కోట్లకు పైగానే బడ్జెట్ అవుతుందన్నారట అట్లీ.

మహేష్ సినిమా కోసం బడ్జెట్ ఇంతా.. అనేం అనుకోలేదు. సబ్జెక్టు డిమాండ్ చేసేదాన్ని బట్టి పెడుతూ పోతామన్నది మేకర్స్ మాట. వెయ్యి కోట్లు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదనే డిస్కషన్ కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ29 కోసం దాదాపు 700 కోట్లను లాక్ చేశారని టాక్.

అందులో సగానికి పైగానే ఖర్చుపెడుతున్నారు పెద్ది మేకర్స్. మళ్లీ మళ్లీ పుడతామా ఏటీ.. అంటూ గ్లింప్స్‌లో రామ్‌చరణ్ చెప్పిన డైలాగుకు వస్తున్న స్పందన చూసి, ఆనందంగా ఖర్చుపెడుతున్నారట ప్రొడ్యూసర్స్. పైసా వసూల్ మూవీ గ్యారంటీ అన్నది వారి నుంచి వినిపిస్తున్న మాట.

ట్రిపుల్ ఆర్ చెర్రీ కోసమే కాదు, తారక్ కోసం కూడా అంతే బడ్జెట్ పెట్టడానికి రెడీ అయ్యారు నిర్మాతలు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించే సినిమాకు, ఆ వెంటనే స్టార్ట్ అయ్యే దేవర సీక్వెల్‌కి కూడా తలా 300 కోట్లకు పైగానే ఖర్చు పెట్టాలన్నది ప్లాన్. సో, రేంజ్ పెరగడం అంటే బిజినెస్‌లో భారీ తనం మాత్రమే కాదు.. పెట్టుబడిలోనూ భారీతనం అని ఈ నెంబర్స్‌తో చెప్పకనే చెబుతున్నారు మేకర్స్.




