- Telugu News Photo Gallery Cinema photos Tollywood heroins like Kayadu Lohar Rukmini Vasanth Ketika Sharma movies update
కొత్త హీరోయిన్లతో టాలీవుడ్ కళకళ.. రెండేళ్ళ వరకు వెనక్కి చూసుకునేదేలే
సినిమాకో కొత్త హీరోయిన్ పరిచయం అవుతుంది కానీ ఏం లాభం..? ఒక్కరు కూడా సక్సెస్ కావట్లేదు కదా..! అందుకేగా మన హీరోలకు ఈ హీరోయిన్ల తిప్పలు. కానీ ఇప్పుడవి తీరిపోయేలా కనిపిస్తున్నాయి. మరో రెండేళ్ళ వరకు హీరోయిన్స్ కష్టాలు ఉండకపోవచ్చు. చాలా మంది బ్యూటీస్ మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. మరి ఇండస్ట్రీకి వచ్చిన ఆ కొత్త బ్యూటీస్ ఎవరు..?
Updated on: Jun 08, 2025 | 8:46 PM

కొత్తమ్మాయిలు రావడం కాదు.. వచ్చిన వాళ్లు సక్సెస్ అయినపుడే హీరోయిన్ల కష్టాలకు కనీసం కామా అయినా పడుతుంది. ఇప్పుడిదే జరుగుతుంది. మిస్టర్ బచ్చన్‌తో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..

భాగ్యశ్రీ మీడియం రేంజ్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ అయిపోయారిప్పుడు. రామ్ పోతినేని, విజయ్ దేవరకొండ కింగ్ డమ్, దుల్కర్ సల్మాన్ కాంతా సినిమాల్లో నటిస్తున్నారీమే.

ప్రభాస్, హను రాఘవపూడి సినిమాతో పరిచయమవుతున్న ఇమాన్వి ఇస్మాయిల్ గురించి చర్చ బాగానే జరుగుతుంది. ఈ సినిమా విడుదలకు ముందే ఇమాన్వికి ఆఫర్స్ వస్తున్నాయి. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాతో రుక్మిణి వసంత్ టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు.

అలాగే మరో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్‌కు రవితేజ, కిషోర్ తిరుమల సినిమాలో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ తర్వాత కయాదు లోహర్ మోస్ట్ వాంటెడ్ అయిపోయారు. ప్రస్తుతం విశ్వక్ సేన్, అనుదీప్ కాంబోలో వస్తున్న ఫంకీతో పాటు నెక్ట్స్ ఆఫర్స్ బాగానే వస్తున్నాయి.

అలాగే సింగిల్ తర్వాత కేతిక శర్మ వైపు చూస్తున్నారు మేకర్స్. రవితేజ సినిమాలో ఆషికాతో పాటు కేతిక ఓ హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ బ్యూటీస్ అంతా క్లిక్ అయితే కొన్నాళ్ల పాటు హీరోయిన్ కష్టాలు తీరిపోయినట్లే.




