సక్సెస్ జోష్‌లో దుల్కర్.. ఈయనకు కలిసొస్తున్న అంశాలేవో తెలుసా?
దుల్కర్ సల్మాన్ మలయాళ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ కిడ్... ఇప్పుడు కేరాఫ్ మార్చేస్తున్నారు. ప్రజెంట్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నా... అందులో ఒక్క సినిమా కూడా ఓన్ లాంగ్వేజ్‌లో చేయటం లేదు. అంతగా అదర్ లాంగ్వేజెస్‌లో దుల్కర్‌కు కలిసొస్తున్న అంశాలేంటి..?
Updated on: Aug 11, 2025 | 2:15 PM

దుల్కర్ సల్మాన్ మలయాళ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ కిడ్... ఇప్పుడు కేరాఫ్ మార్చేస్తున్నారు. ప్రజెంట్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నా... అందులో ఒక్క సినిమా కూడా ఓన్ లాంగ్వేజ్‌లో చేయటం లేదు. అంతగా అదర్ లాంగ్వేజెస్‌లో దుల్కర్‌కు కలిసొస్తున్న అంశాలేంటి..?

ఏ క్షణాన దుల్కర్ సల్మాన్ మహానటి సినిమాకు ఓకే చెప్పారోగాని.. అప్పటి నుంచి పూర్తిగా తెలుగు వాడైపోయారు ఈ మలయాళ స్టార్. మహానటి తరువాత కాస్త గ్యాప్ తీసుకున్నా... ఇప్పుడు వరుసగా తెలుగు సినిమాలతోనే బిజీగా ఉన్నారు. దుల్కర్ టాలీవుడ్‌లో ఎంత బిజీ అంటే... ప్రజెంట్ ఈ హీరో ఒక్క మలయాళ సినిమా కూడా చేసే పరిస్థితి లేదు.

లక్కీ భాస్కర్‌తో పాన్ ఇండియా హిట్ అందుకున్న దుల్కర్ సల్మాన్ పూర్తిగా టాలీవుడ్‌కే ఫిక్స్ అయ్యారు. ప్రజెంట్ కాంత, ఆకాశంలో ఒకతార సినిమాల్లో నటిస్తున్న దుల్కర్. తాజాగా మరో క్రేజీ మూవీని లైన్‌లో పెట్టారు. అది కూడా టాలీవుడ్‌లోనే కావటం మరో విశేషం.

రవి నేలకుదిటి దర్శకుడిగా పరిచయం అవుతూ రూపొందిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నారు దుల్కర్. సోమవారం మొదలైన ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్నట్టుగా వెల్లడించారు మేకర్స్. ఈ మూడు సినిమాల షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ మలయాళ స్టార్.

Dulquer Salmaan4