- Telugu News Photo Gallery Cinema photos These are the major Highlights of Prabhas's Adipurush Movie telugu cinema news
Adipurush: “నా ఆగమనం.. అధర్మ విద్వంసం”.. జానకి కోసం రాముడి రాక.. ‘ఆదిపురుష్’ హైలెట్స్..
ఎప్పుడెప్పుడా అని సినీప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్ మరికొన్ని గంట్లలో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే బుకింగ్స్ ఫుల్ అయ్యాయి. మొదటిసారి పౌరాణిక చిత్రంలో ప్రభాస్ నటిస్తుండడం.. అది కూడా రాముడి పాత్రలో కనిపించనుండడంతో ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ప్రేక్షకులు.
Updated on: Jun 15, 2023 | 9:19 PM

ఎప్పుడెప్పుడా అని సినీప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్ మరికొన్ని గంట్లలో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే బుకింగ్స్ ఫుల్ అయ్యాయి.

మొదటిసారి పౌరాణిక చిత్రంలో ప్రభాస్ నటిస్తుండడం.. అది కూడా రాముడి పాత్రలో కనిపించనుండడంతో ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ప్రేక్షకులు.

ఇందులో జానకిగా కృతిసనన్ నటిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సీతగా తన లుక్ ఆకట్టుకుంది. ఇక రావణ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.

రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందించిన ఈ సినిమాను దాదాపు రూ.600 బడ్జెట్ తో నిర్మించడం విశేషం.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 9000 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే తెలుగులో 1500, మిగతా భాషలన్నీ కలిపి 4000, ఓవర్సీస్ లో 3500 స్క్రీన్స్ ఈ సినిమాకు కేటాయించారు.

సినీచరిత్రలో ఎప్పుడూ లేనివిదంగా ఈ సినిమా టికెట్స్ వేల సంఖ్యలో సినీ సెలబ్రెటీలు కొనుగోలు చేసి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

ఆదిపురుష్ విడుదలయ్యే ప్రతి థియేటర్లో హనుమంతుడికి ఓ సీట్ కేటాయించారు.

తెలుగు మినహా.. మిగతా అన్ని భాషల్లో ఆదిపురుష్ నిర్మాతలు స్వయంగా రిలీజ్ చేస్తున్నారు.

ఢిల్లీ, ముంబై సహా పలు మెట్రో నగరాల్లో టికెట్స్ రేట్స్ ఆకాశాన్ని అంటుతున్న అడియన్స్ ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.




