- Telugu News Photo Gallery Cinema photos These are the heroines who are also doing business along with movies
Tollywood :రెండు చేతులా సంపాదిస్తున్న భామలు.. ఇటు సినిమాలు అటు బిజినెస్‌లు
హీరోయిన్ల కెరీర్ స్పాన్ తక్కువన్నది అందరూ అనుకునే మాటే. మరి వాళ్ల బిజినెస్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? చూసేద్దాం
Updated on: Dec 17, 2022 | 1:14 PM

ఫిట్‌నెస్ మీద పెట్టిన దృష్టిని, రకుల్ ఏ ఒలింపిక్స్ మీదో పెట్టి ఉంటే, ఈ పాటికి వంద గోల్డ్ మెడల్స్ కొట్టేసేది... అని ఓ సారి రకుల్ కి కాంప్లిమెంట్ ఇచ్చారు మంచు లక్ష్మి. రకుల్‌ని దగ్గరగా చూసిన ప్రతి ఒక్కరిదీ ఇదే మాట. ఎన్ని రకాల ఫిట్‌నెస్‌లున్నా, వాటన్నిటినీ ఎక్కడో ఓ చోట ట్రై చేసి, సాధన చేసే ఉంటారు ఈ భామ. తనకు తెలిసిన విద్యనే నలుగురికి నేర్పించాలన్నది రకుల్ ఐడియా. అందుకే ఫిట్‌నెస్ స్టూడియోలు ప్రారంభించారు. ఫిజికల్ ఫిట్‌నెస్‌కీ, మెంటల్ హెల్త్ కీ ఎప్పుడూ జబర్దస్త్ కనెక్షన్ ఉంటుందంటారు రకుల్.

మిల్కీ బ్యూటీ కూడా ఫిట్‌గా ఉంటారు. అయితే ఆమె ఎంపిక చేసుకున్న బిజినెస్ మాత్రం ఫిట్‌నెస్‌కి సంబంధించింది కాదు. ఫ్యాషన్‌కి సంబంధించింది. ఎప్పటినుంచో గోల్డ్ ఆర్నమెంట్స్ డిజైనింగ్ మీద ఇంట్రస్ట్ ఉంది తమన్నాకి. అందుకే తాను స్వయంగా డిజైన్ చేసిన జువెలరీని ఆన్‌లైన్‌లో అమ్ముతుంటారు తమన్నా భాటియా.

ఇలాంటి వ్యాపారమే చేస్తున్నారు కాజల్ అగర్వాల్. పెళ్లి కాకముందే కాదు, పెళ్లయిన తర్వాత కూడా భర్తతో కలిసి ఓ బిజినెస్ స్టార్ట్ చేశారు కాజల్ అగర్వాల్. పెళ్లయ్యాక, తల్లయ్యాక సినిమాల్లో రెగ్యులర్‌గా ఏమీ కనిపించడం లేదు కాజల్. ఆ సమయాన్ని బిజినెస్‌ల ఎస్టాబ్లిష్‌మెంట్ కోసం వాడుకుంటున్నారనే టాక్ కూడా ఉంది.

మనకు కలిగిన ప్రతి అనుభవం నుంచి ఓ ఆలోచన పుట్టుకొస్తుంది అని అంటారు ఆలియా. తనకు నచ్చిన రంగాల్లో పరిధిని విస్తృతం చేసుకోవడానికి ఎప్పుడూ వెనకాడరు ఆలియా. ఆల్రెడీ కిడ్స్ వేర్ బ్రాండ్ ఉంది ఆలియాకు. రీసెంట్‌గా ప్రెగ్నెంట్ విమెన్ కోసం అందులోనే డిజైనర్ వేర్‌ని క్రియేట్ చేశారు. తను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు సౌకర్యవంతమైన దుస్తులను వెతకడంలో పడ్డ కష్టం, ఆ కంఫర్ట్ లెవల్స్ అర్థం చేసుకున్న వ్యక్తిగా ఈ బిజినెస్‌కి తాను వంద శాతం న్యాయం చేస్తానన్నది ఆలియా చెప్పిన మాట.

నేను స్కూలు, కాలేజీ పూర్తి చేసి మోడలింగ్‌లో అడుగుపెడుతున్న క్రమంలో బ్రాండెడ్ కాస్ట్యూమ్స్ వేసుకోవాలనుకునేదాన్ని. కానీ నాకు అవి అంత అందుబాటు ధరల్లో ఉండేవి కాదు. బ్రాండెడ్ అనగానే అదేదో అందనంత దూరంలో ఉంటుందన్న ఫీలింగ్ వచ్చేది. కానీ మధ్య తరగతి అమ్మాయిలు కూడా బ్రాండెడ్ బట్టలు ధరించాలన్న ఆశయంతో సాకీ ప్రారంభించాను. ఇందులో ప్రతి డిజైన్‌లోనూ నా మనసు కనిపిస్తుంది అని అంటారు సమంత. కాస్ట్యూమ్స్ మాత్రమే కాదు, పసిపిల్లలకు సంబంధించి ఎడ్యుకేషనల్ ఫీల్డ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు సామ్. నటిగా బిజీగా ఉంటూనే, బిజినెస్‌లు కూడా స్వయంగా చూసుకుంటున్నారు సామ్.

బిజినెస్‌లు మనమే చేయక్కర్లేదు. మన వాళ్లు చేసినా వాళ్లకు సపోర్టింగ్‌గా ఉంటే అదే పది వేలు అనే ఫార్ములా తాప్సీ సొంతం. అందుకే ఆమె నటనకు, నిర్మాణానికి సమయం కేటాయిస్తున్నారు. తన సోదరి షగుణ్ నిర్వహిస్తున్న ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి తనవంతు సపోర్ట్ చేస్తున్నారు. ఈవెంట్ మేనేజ్‌మెంట్ బిజినెస్ మీద కంప్లీట్ అవేర్‌నెస్ ఉంది తాప్సీకి.

ఫ్యామిలీలో చాలా మంది డాక్టర్లున్నా, నాకు యాక్టింగ్ అంటే ఉన్న ప్యాషన్‌తో ఆ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాను అని అంటారు ప్రణీత. ఎవరు ఏ రంగంలో రాణించాలన్నా, హెల్త్ ఇంపార్టెంట్ అనీ, మంచి ఆరోగ్యం కావాలంటే మంచి ఆహారం కావాలని, జిహ్వకు నచ్చే భోజనంతో పాటు, ఆరోగ్యాన్ని ప్రసాదించే ఫుడ్ మీద తనకు కాన్‌సెన్‌ట్రేషన్ ఎక్కువని చెబుతారీ బాపు బొమ్మ. అందుకే తన హోటళ్లలో ఆ హైజీన్‌ని మెయింటెయిన్ చేస్తానంటున్నారు ప్రణీత. ఆమె నిర్వహిస్తున్న హోటళ్లకు బెంగుళూరులో మంచి డిమాండ్ ఉంది.

నేను బాగుపడ్డానంటే, సమాజంలో ఏదో ఒక వర్గానికి నా వంతు సపోర్ట్ చేసి తీరుతానని చిన్నప్పటి నుంచీ అనుకునేదాన్ని అన్నది శ్రియ మాట. ఆ మాటకు తగ్గట్టే ఉంది ఆమె మొదలుపెట్టిన స్పా. విజువలీ చాలెంజ్డ్ టీమ్‌తో శ్రియ స్పా రన్ చేస్తున్నారు.




