Gold Movies: ప్రాజెక్ట్ ఈజ్ గోల్డ్ అంటున్న స్టార్ హీరోలు.. అయితే హిట్టే.!
నీ ఇల్లు బంగారం కానూ అనే మాట పాతదైపోయింది. ఇప్పుడు మేకర్స్ నీ సినిమా బంగారం కానూ అని బ్లెస్ చేస్తున్నారు. ఇంకా తెలుగులో ఈ కాన్సెప్ట్ పెద్దగా వైరల్ కావడం లేదుగానీ, పొరుగు భాషల్లో మాత్రం బంగారంతో ముడిపడ్డ కాన్సెప్టులను బంగారంలాగా చూసుకుంటున్నారు. లోకేష్ కనగరాజ్ డైరక్షన్‌లో రజనీకాంత్ నటిస్తున్న సినిమా కూలీ. ఈ సినిమా కాన్సెప్ట్ మొత్తం బంగారం చుట్టూ తిరుగుతుందనే విషయాన్ని చెప్పకుండా చెప్పేశారు మేకర్స్.