- Telugu News Photo Gallery Cinema photos Teja Sajja stylish Photoshoot Goes fashionable in social media on 29 03 2023 Telugu Actors Photos
Teja Sajja: స్టైల్ కా బాప్.. చూస్తుండగానే ఎదిగిపోతున్న తేజ సజ్జా..! పాన్ ఇండియా రేంజ్ లో..
యంగ్ హీరో తేజ సజ్జ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించి అలరించాడు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తనదైన స్టైల్ స్వాగ్ తో గర్ల్స్ ఫాలోయింగ్ కూడా బానే సంపాదించాడు.
Updated on: Mar 29, 2023 | 5:37 PM

యంగ్ హీరో తేజ సజ్జ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించి అలరించాడు.

ఇక ఇప్పుడు హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. జాంబీరెడ్ది సినిమాతో హీరోగా మారిన తేజ తొలి సినిమాతోనే మంచి హీట్ అందుకున్నాడు.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత తేజ రెండు మూడు సినిమాలు చేశాడు. ఇక ఇప్పుడు మరోసారి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా హను-మాన్ అనే టైటిల్ తో రానుంది. ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో అంటూ ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా హీరో తేజ మాట్లాడుతూ..ఇంతగొప్ప సినిమాలో పాత్రకు న్యాయం చేస్తానని నమ్మి అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ వర్మకి థాంక్స్ చెప్పడం చిన్న మాటే అవుతుంది.

ఆయనతో ఇదివరకే ఒక సినిమా చేశాను. ఇప్పుడు రెండో సినిమా చేస్తున్నాం.

ప్రశాంత్ గారు గ్రేట్ క్రాఫ్ట్ మాన్. ఆయనతో ప్రతి క్షణం లెర్నింగ్ ప్రాసస్ వుంటుంది. సినిమా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. హనుమంతులవారి గురించి చెప్పినపుడు వినయం, నిజాయితీ, గొప్ప అనే మాటలు చెబుతాం. మా సినిమా కూడా అంతే వినయంగా నిజాయితీతో సినిమా చేశాం. కానీ సినిమా చాలా గొప్పగా వుండబోతుంది.




