- Telugu News Photo Gallery Cinema photos Tamil heroes in focus for next 5 months with Bharateeyudu 2, Vettaiyan, Vidaamuyarchi, Kanguva movie releases
Tollywood News: రాబోయే 5 నెలల పై ఫోకస్ చేసిన తమిళ హీరోలు
కల్కితో సెకండాఫ్‌కు అదిరిపోయే స్టార్ట్ ఇచ్చారు ప్రభాస్. వ్రతం ఒకరు చేస్తే.. ఫలితం మరొకరికి దక్కినట్లు.. ఇక్కడ కల్కి స్టార్ట్ చేస్తే ఆ అడ్వాంటేజ్ తమిళ డబ్బింగ్ సినిమాలు తీసుకునేలా కనిపిస్తున్నాయి. మన సెకండాఫ్ అంతా సోసోగానే కనిపిస్తుండగా.. అరవ సినిమాలు మాత్రం దండయాత్రకు రెడీ అవుతున్నాయి. రాబోయే 5 నెలల్లో ఎవరి వాటా ఎంతో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? తొలి ఆర్నెళ్లలో కేవలం సంక్రాంతి మాత్రమే వర్కవుట్ అయింది. ఆ తర్వాత ఇన్నాళ్లకు కల్కితో బాక్సాఫీస్ దుమ్ము దులిపేస్తున్నారు ప్రభాస్.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Jul 08, 2024 | 6:59 PM

సినిమా థియేటర్లలోకి వచ్చే రోజు కోసం జనాలు ఈగర్‌గా వెయిట్ చేసే రోజులు రాను రాను తగ్గుతున్నాయి. సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేసే వారు కొందరైతే, ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేసే వర్గం కూడా క్రియేట్ అవుతోంది. ఓటీటీ రిలీజ్ అన్నది సినిమా జయాపజయాల మీద ఎక్కువగా ఆధారపడుతుందన్నది నిదానంగా అర్థమవుతున్న విషయం.

తొలి ఆర్నెళ్లలో కేవలం సంక్రాంతి మాత్రమే వర్కవుట్ అయింది. ఆ తర్వాత ఇన్నాళ్లకు కల్కితో బాక్సాఫీస్ దుమ్ము దులిపేస్తున్నారు ప్రభాస్. ఈ ఊపు సెకండాఫ్‌లో కంటిన్యూ అవుతుందా అంటే.. ఆగస్ట్‌లో రావాల్సిన పుష్ప 2 డిసెంబర్‌కు వెళ్లిపోయింది. గేమ్ ఛేంజర్ వస్తుందో రాదో డైలమాలో ఉంది.. హరిహర వీరమల్లు ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారు.. దేవర ఒక్కటే డేట్ కన్ఫర్మ్ చేసాడు.

సెకండాఫ్‌లో మన దగ్గర భారీ సినిమాలు తక్కువగానే ఉన్నాయి. ఆగస్ట్ 15న డబుల్ ఇస్మార్ట్, 29న సరిపోదా శనివారం అంటూ రామ్, నాని వచ్చేస్తున్నారు. ఇక మిస్టర్ బచ్చన్‌తో రవితేజ, బాబీ సినిమాతో బాలయ్య రావాలని చూస్తున్నారు. మరోవైపు కల్కి ఇచ్చిన స్టార్ట్‌ను మనకంటే బాగా తమిళ హీరోలు వాడుకునేలా కనిపిస్తున్నారు.

2024లో మిగిలిన 5 నెలల్లో మనతో పోటీ పడుతూ తమిళం నుంచి కూడా కొన్ని భారీ సినిమాలు వస్తున్నాయి. అందులో జులై 12న భారతీయుడు 2 ముందు వరసలో ఉంది. ఈ సినిమా రిజల్ట్‌పైనే గేమ్ ఛేంజర్ ఫ్యూచర్ కూడా ఆధారపడి ఉంది. ఇండియన్ 2 హిట్ అయిందంటే.. దెబ్బకు గేమ్ ఛేంజర్ మార్కెట్ పెరిగిపోవడం ఖాయం.

దేవర సినిమా వదిలేసిన అక్టోబర్ 10ని ఫిక్స్ చేసుకుంది సూర్య కంగువ. దేవర లాంటి మాస్ కంటెంట్ కంగువలోనూ ఉందా.? 35కి పైగా భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాలో యూనివర్శల్ ఆడియన్స్ ని మెప్పించే కంటెంట్ ఏం ఉంది.?





























