- Telugu News Photo Gallery Cinema photos Tamannaah Bhatia Glows In Red Shimmer For Jailer Launch, See Photos
Tamannaah Bhatia: ‘జైలర్’ ఆడియో లాంచ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా తమన్నా.. రెడ్ డ్రెస్‌లో మెరిసిపోయిన మిల్కీ బ్యూటీ
రజనీకాంత్ హీరోగా నటిస్తోన్న జైలర్ ఆగస్టు 10న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ఆడియో ఫంక్షన్ గ్రాండ్‌గా జరిగింది. సూపర్ స్టార్ రజనీ, తమన్నాతో పాటు మూవీ యూనిట్ సభ్యులందరూ ఈ ఫంక్షన్‌కు హాజరయ్యారు.
Updated on: Jul 30, 2023 | 8:04 PM

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ ప్రస్తుతం ఫుల్ స్పీడ్‌లో ఉంది. ఓవైపు ఓటీటీల్లో అదరగొడుతూనే సినిమాల్లోనూ సందడి చేస్తుంది. ఇటీవల జీకర్దా, లస్ట్ స్టోరీస్ 2లో హాట్ గా కనిపించిన తమన్నా ఇప్పుడు జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

రజనీకాంత్ హీరోగా నటిస్తోన్న జైలర్ ఆగస్టు 10న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ఆడియో ఫంక్షన్ గ్రాండ్‌గా జరిగింది. సూపర్ స్టార్ రజనీ, తమన్నాతో పాటు మూవీ యూనిట్ సభ్యులందరూ ఈ ఫంక్షన్‌కు హాజరయ్యారు.

ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది తమన్నా. రెడ్ డ్రస్‌లో ఆడియో ఫంక్షన్‌కు హాజరై షో స్టాపర్‌గా నిలిచింది. బ్యూటీఫుల్ లుక్ తో పాటు గ్లామర్ మెరుపులతో అందరి చూపు తనపైనే పడలేలా చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇదే ఈవెంట్ లో తన లేటెస్ట్ ట్రెండింగ్ సాంగ్ 'కావాలయ్యా' సాంగ్‌కు స్టెప్పులేసి ఆకట్టుకుంది తమన్నా. ఇక జైలర్ రిలీజైన మరుసటి రోజే చిరంజీవితో కలిసి సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయనుంది తమన్నా.

భోళాశంకర్ ఆగస్టు 11నే రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్లు, సాంగ్స్, ట్రైలర్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఇందులో కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.




