- Telugu News Photo Gallery Cinema photos Tamannaah Bhatia Aaj Ki Raat song form Stree 2 now trending in bollywood
Tamannaah Bhatia: నార్త్ లో సక్సెస్.. మరి మిల్కీబ్యూటీ పార్టీ ఇస్తున్నారా ??
ఆజ్ రాత్ మేరే ఘర్ మే పార్టీ హై.... అని అనడానికి రెడీ అవుతున్నారు తమన్నా భాటియా. నిన్న మొన్నటిదాకా ఆమె గురించి సౌత్‌లో మాత్రమే వైరల్ అయిన ఓ విషయం ఇప్పుడు నార్త్ లోనూ స్ప్రెడ్ అవుతోంది. ఈ వారం తమన్నా చాలా ఖుషీగా ఉన్నారు. వైరల్ న్యూస్‌కీ, తమన్నా ఖుషీకీ ఉన్న లింకేంటో చూసేద్దాం రండి.... తమన్నా స్పెషల్ సాంగ్ చేస్తే సినిమా సూపర్ డూపర్ హిట్.
Updated on: Aug 18, 2024 | 2:45 PM

ఆజ్ రాత్ మేరే ఘర్ మే పార్టీ హై.... అని అనడానికి రెడీ అవుతున్నారు తమన్నా భాటియా. నిన్న మొన్నటిదాకా ఆమె గురించి సౌత్‌లో మాత్రమే వైరల్ అయిన ఓ విషయం ఇప్పుడు నార్త్ లోనూ స్ప్రెడ్ అవుతోంది. ఈ వారం తమన్నా చాలా ఖుషీగా ఉన్నారు. వైరల్ న్యూస్‌కీ, తమన్నా ఖుషీకీ ఉన్న లింకేంటో చూసేద్దాం రండి....

తమన్నా స్పెషల్ సాంగ్ చేస్తే సినిమా సూపర్ డూపర్ హిట్. టాక్‌తో సంబంధం లేకుండా వైరల్ అయిపోతుంది మిల్కీ బ్యూటీ సాంగ్... ఆమె స్టెప్పులకే ఫిదా అవుతారో, లేకుంటే ఆమె చేస్తున్నారని తెలియగానే మ్యూజిక్ డైరక్టర్స్ స్పెషల్‌గా బీట్ కొడతారోగానీ... పాటలన్నీ ఇన్‌స్టంట్‌గా హిట్ అవుతున్నాయి.

మొన్నటికి మొన్న రజనీకాంత్ జైలర్ సినిమాకు కూడా జనాలను పోగేసిన సినిమా వా నువ్వు కావాలయ్యా సాంగ్. మిల్కీ బ్యూటీ అలా తళుక్కుమనగానే అమాంతం క్రేజ్ వచ్చేసింది ప్రాజెక్టుకి.

ఈ విషయం తెలిసిన నార్త్ ఇండియన్స్ కూడా ఆమె మిడాస్ టచ్‌కి వావ్ అంటున్నారు. ఇండిపెండెన్స్ వీక్ తమన్నా భాటియాకు చాలా స్పెషల్. ఆమె నటించిన వేదా, స్త్రీ2 ఒకేరోజు విడుదలయ్యాయి. వేదాలో ఇంపార్టెంట్ రోల్ చేసిన ఆమె, స్త్రీ2లో మాత్రం స్పెషల్ సాంగ్ చేశారు.

వేదాకి పాజిటివ్ టాక్ రాకపోయినా, స్త్రీ2 మాత్రం తమన్నా క్రేజ్ ని నార్త్ ఆడియన్స్ మధ్య మరో సారి పెంచేసింది... తమన్నానా.. మజాకా అంటున్నారు ఉత్తరాది వాసులు.




