- Telugu News Photo Gallery Cinema photos Taapsee Pannu Follows Foot Steps Of Heroine Nayanthara in Bollywood Telugu Actress Photos
Nayanthara – Taapsee Pannu: ఆ విషయంలో నయన్ ఫాలో అవుతున్న తాప్సీ.!
నయనతార అండ్ తాప్సీ.. సేమ్ స్కూల్‌లో చదువుకున్నట్టు, ఒకటే సిలబస్‌ని గుర్తుచేసుకుంటున్నారు. ఇంతకీ వీళ్లిద్దరూ మాట్లాడుతున్నది అకాడమిక్స్ గురించి అనుకునేరు... కానే కాదండోయ్.. ఇక్కడ ఈ భామలిద్దరూ చెబుతున్నది ఫ్యామిలీ పాఠాలు. అందులో ప్రయారిటీస్ అనే టాపిక్! యస్.. ఆఫ్టర్ మేరేజ్ ప్రయారిటీస్ మారిపోయాయంటున్నారు బాస్ లేడీస్! పరుగు ఆపడం ఓ కళ అని ఎక్కడో చదివినట్టున్నారు మేడమ్ నయనతార. వేగంగా తీస్తున్న పరుగును ఏకంగా ఆపేయకుండా,
Updated on: Apr 10, 2024 | 2:31 PM

నయనతార అండ్ తాప్సీ.. సేమ్ స్కూల్‌లో చదువుకున్నట్టు, ఒకటే సిలబస్‌ని గుర్తుచేసుకుంటున్నారు. ఇంతకీ వీళ్లిద్దరూ మాట్లాడుతున్నది అకాడమిక్స్ గురించి అనుకునేరు... కానే కాదండోయ్.. ఇక్కడ ఈ భామలిద్దరూ చెబుతున్నది ఫ్యామిలీ పాఠాలు. అందులో ప్రయారిటీస్ అనే టాపిక్!

త్రిష, నయనతారతో పాటు నేషనల్ క్రష్ రష్మిక పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. ఫిజికల్ అప్పియరెన్స్ కి రష్మిక చక్కగా సరిపోతారనే మాటలు జోరందుకున్నాయి.

డబ్బు అవసరమే కానీ, అంతకన్నా ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి. నాకున్న 24 గంటలనీ ఆలోచించి ప్లాన్ చేసుకుంటాను అని అంటున్నారు నయన్. ఏ విషయాన్నైనా సరే స్టేట్ మెంట్లు ఇచ్చి.. చాటింపేయడం నయనతారకి అసలు అలవాటు లేదు. ఆమెకి తెలిసిందంతా ఒక్కటే... ఆచరించి చూపించేయడం.

యాజ్ ఇట్ ఈజ్‌గా... ఇప్పుడు ఈ బ్యూటీ చేస్తున్నది అదే. భర్త విఘ్నేష్ శివన్, పిల్లలు ఉయిర్, ఉలగ్‌కి కావాల్సినంత టైమ్ కేటాయించాలని, వారి ఆలనాపాలనా చూడాలని అనుకుంటున్నారు నయన్. తనకు హార్ట్ టచింగ్‌గా అనిపించిన స్టోరీలకు మాత్రమే డాటెడ్ లైన్స్ మీద సైన్ చేస్తున్నారు. అంతంత మాత్రంగా అనిపించే కథలకు నిర్మొహమాటంగా నో చెప్పేస్తున్నారు నయన్.

సౌత్‌లో నయన్ ఫాలో అవుతున్న ఫార్ములాని నార్త్ లో తాప్సీ అలవాటు చేసుకుంటున్నారు. చిరకాల మిత్రుడి మాథియాస్ బోని ఇటీవల పెళ్లి చేసుకున్నారు తాప్సీ పన్ను. ప్రైవేట్ ఈవెంట్‌లా జరిగింది వీళ్ల పెళ్లి. ఆఫ్టర్ మేరేజ్ తాప్సీలో చాలా మార్పులే కనిపిస్తున్నాయని అంటున్నారు జనాలు.

జీవితంలో సినిమాలు, సంపాదన ముఖ్యమే. కానీ అవే జీవితం కాదు అన్నది తాప్సీ మాట. కెరీర్‌ని మించిన లైఫ్ ఉంది నాకు. నా జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను. అందుకే సెలక్టెడ్ సినిమాలు చేస్తున్నాను అని ఓపెన్‌గానే చెప్పేశారు తాప్సీ.

ఇప్పటిదాకా తాను పలు రకాల జోనర్లలో సినిమాలు చేశానని, అంత వైవిధ్యమున్న పాత్రలను ఎంపిక చేసుకోవడం చాలా కష్టమని అన్నారు తాప్సీ.




