- Telugu News Photo Gallery Cinema photos Super Star Mahesh Babu Next Movie With Rajamouli #SSMB29 Update Telugu Heroes Photos
Mahesh Babu: #SSMB29 స్క్రిప్ట్‌లో రాజమౌళి మార్పులు.! షూటింగ్ ఎప్పుడంటే.?
మహేష్ బాబు తెలుగు సినిమాలు చేయరా..? ఇకపై రీజినల్ సినిమాలకు దూరంగా ఉండాలని ఫిక్సైపోయారా.? అందుకే గుంటూరు కారంలో అంతగా ఓపెన్ అయిపోయి డాన్సులు గట్రా భీభత్సంగా చేసారా..? అసలు మహేష్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి.? మరోవైపు మహేష్ సినిమా స్క్రిప్ట్‌ను రాజమౌళి ఇప్పుడు మార్చేస్తున్నారా..? అసలేంటి సంగతి.? నిన్నమొన్నటి వరకు కూడా గుంటూరు కారంతోనే బిజీగా ఉన్నారు మహేష్ బాబు. ఇప్పుడిప్పుడే ఈ చిత్రం నుంచి బయటికి వచ్చేస్తున్నారీయన.
Updated on: Jan 20, 2024 | 8:59 PM

మహేష్ బాబు తెలుగు సినిమాలు చేయరా..? ఇకపై రీజినల్ సినిమాలకు దూరంగా ఉండాలని ఫిక్సైపోయారా..? అందుకే గుంటూరు కారంలో అంతగా ఓపెన్ అయిపోయి డాన్సులు గట్రా భీభత్సంగా చేసారా..? అసలు మహేష్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి..?

మరోవైపు మహేష్ సినిమా స్క్రిప్ట్‌ను రాజమౌళి ఇప్పుడు మార్చేస్తున్నారా..? అసలేంటి సంగతి..? నిన్నమొన్నటి వరకు కూడా గుంటూరు కారంతోనే బిజీగా ఉన్నారు మహేష్ బాబు. ఇప్పుడిప్పుడే ఈ చిత్రం నుంచి బయటికి వచ్చేస్తున్నారీయన.

ఓ చిన్న వెకేషన్ తర్వాత మళ్లీ రాజమౌళి సినిమాపై ఫోకస్ చేయాలని ఫిక్స్ అయిపోయారు సూపర్ స్టార్. జక్కన్న సినిమాతో తన మార్కెట్ పెరుగుతుందని ముందుగానే డిసైడ్ అయిపోయారు మహేష్. రాజమౌళి సినిమా తర్వాత పాన్ ఇండియన్ మార్కెట్‌కు రూట్ అనే విషయం హీరోలందరికీ తెలుసు.

మహేష్ కూడా ఇదే చెప్పారు. ఇకపై రీజినల్ సినిమాలు చేస్తానో లేదో.. మళ్లీ మాస్ డాన్సులు చేసే అవకాశం వస్తుందో రాదో అని గుంటూరు కారంలో ఫ్యాన్స్‌కు ట్రిబ్యూట్ ఇచ్చానని చెప్పుకొచ్చారు సూపర్ స్టార్. రాజమౌళి సినిమా కోసం కచ్చితంగా మూడేళ్ళైతే రాసివ్వాల్సిందే.

ఎంత వేగంగా సినిమాను పూర్తి చేసినా కూడా 2027లోనే ఇది వస్తుందని అభిమానులతో పాటు అంతా ఫిక్సైపోయారు కూడా. మరోవైపు మహేష్ సైతం ప్రిపేర్ అయిపోయారు.

ఇదిలా ఉంటే SSMB 29 స్క్రిప్ట్‌లో రాజమౌళి కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది. మహేష్ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ ఇప్పటికే మొదలైంది. ఇదొక అడ్వంచరస్ థ్రిల్లర్ అని.. ఇందులో హీరో ప్రపంచ యాత్రికుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

మెయిన్ స్టోరీలో మార్పులు చేయకపోయినా.. స్క్రిప్ట్‌లో మాత్రం చిన్నచిన్న మార్పులు చేయాలని టీంకు రాజమౌళి చెప్పినట్లు తెలుస్తుంది. 2024 సెకండాఫ్‌లో ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుంది.




