- Telugu News Photo Gallery Cinema photos Star heroes fans fire on Rana Daggubati and Teja Sajja's comments at IIFA Utsavam
IIFA Utsavam: ఐఫా వేదికగా రానా, తేజ సజ్జా వ్యాఖ్యలు నెట్టింట రచ్చ.. అసలేమైంది.?
హద్దుల్లో ఉంటే ఏదైనా అందంగా ఉంటుంది. అన్నవారికీ బావుంటుంది. అనిపించుకున్నవారికీ బావుంటుంది. కానీ కొన్నిసార్లు పదాలు మనుషుల మధ్య దూరం పెంచుతాయి. మనసులను హర్ట్ చేస్తాయి. ఐఫా వేదికగా రానా, తేజ సజ్జా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇలాంటి ముప్పు తెచ్చిపెట్టాయా? అసలేమైంది? చూసేద్దాం రండి...
Updated on: Nov 09, 2024 | 9:05 AM

ఈ ఏడాది బచ్చన్ హయ్యస్ట్ హై చూశారు.. లోయస్ట్ లో చూశారు అంటూ ఐఫా వేదిక మీద చేసిన కామెంట్ వివాదానికి దారి తీసింది. హయ్యస్ట్ హైగా కల్కి గురించి చెబితే లోయస్ట్ లోగా మిస్టర్ బచ్చన్‌ని రెఫర్ చేశారు హోస్ట్స్. దాంతో ట్విట్టర్‌లో ఫైర్ మొదలైంది. అలా ఎలా అంటారంటూ మాస్ మహరాజ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

అనుకోనీ తమ్ముడూ ఎన్నో విన్నాం.. అందులో ఇదోటి. అన్ని రోజులూ ఒకేలా ఉండవు. నాకైనా.. ఎవరికైనా.. అంటూ హరీష్ శంకర్ ఒపీనియన్ షేర్ చేశారు. జస్ట్ మాస్ మహరాజ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఆ వేదిక మీద సెటైర్లు పడ్డ మిగిలిన సినిమాల హీరోల తాలూకు ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు.

పుష్ప2 లేట్‌గా వస్తోందంటూ తేజ సజ్జా చేసిన వ్యాఖ్యల మీద కూడా గట్టిగానే ఫైర్ అవుతున్నారు పుష్పరాజ్ ఫ్యాన్స్. అదే వేదిక మీద తన హనుమాన్ సినిమా మీద చిన్న మాట పడనివ్వని తేజ.. పుష్పను మాత్రం అంత మాట ఎలా అనగలిగాడంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.

మా జనరేషన్‌లో మంచి నటుడు నాని అంటూ నానిని మెచ్చుకున్న రానాకి, సూపర్‌స్టార్ మహేష్ మీద సెటైర్లు వేయాల్సిన అవసరమేంటన్నది నెట్టింట్లో సినీ అభిమానుల మధ్య జరుగుతున్న డిస్కషన్.

తమ మీద తాము జోక్స్ వేసుకుని నవ్వుకునే సంస్కృతి నార్త్ వాళ్లకు ఉంటే ఉండొచ్చు.. సౌత్‌లో సెన్సిబిలిటీస్ ఎక్కువ. అవి తెలిసి కూడా ఆ వేదిక మీద మన వాళ్లు రెచ్చిపోవడం ఏంటన్నది గట్టిగా జరుగుతున్న చర్చ. బాలీవుడ్ స్టైల్‌ని ఫాలో అవుదామనుకున్న బాబులకు సోషల్ మీడియా సెగ ఎలా ఉంటుందో ఇప్పటికే అర్థమై ఉంటుందిగా..!




