పెద్దిలో శ్రీలీల.. గ్లోబల్‌స్టార్ స్పెషల్ ప్లాన్ అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్
పెద్ది సినిమా చర్చల్లో ఉన్నప్పటి నుంచే సుకుమార్, బుచ్చిబాబు సానా మధ్య పోలికలు వెతకడం మొదలుపెట్టేశారు జనాలు. అలాంటివారి కోసమే లేటెస్ట్ గా ఫిల్మ్ నగర్‌లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ డిస్కషన్‌లో కిస్సిక్ బ్యూటీ శ్రీలీల పేరు మారుమోగిపోతోంది... ఇంతకీ ఏంటా వార్త.. మాట్లాడుకుందాం పదండి... రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా పెద్ది.
Updated on: May 12, 2025 | 9:43 PM

రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా పెద్ది. ఈ సినిమా షూటింగ్‌కి స్మాల్ గ్యాప్ ఇచ్చారు. ఈ టైమ్‌ని ఫారిన్‌లో ఉన్న పనులు కంప్లీట్ చేసుకోవడానికి వాడుకుంటున్నారు చెర్రీ. మరి డైరక్టర్ ఏం చేస్తున్నారు? అని అడిగితే.. స్పెషల్ సాంగ్‌కి జిగేల్‌మనిపించే భామను వెతికే పనిలో పడ్డారనే మాట వినిపిస్తోంది.

రంగస్థలంలో జిగేల్‌రాణి సాంగ్ ఎంత పాపులర్ అయిందో, పెద్దిలో అంతకు మించి సిట్చువేషన్‌లో సాంగ్‌కి ప్లేస్‌మెంట్ ఫిక్స్ చేశారట బుచ్చిబాబు సానా. ఈ పాట కోసం కిస్సిక్ భామ శ్రీలీలను అప్రోచ్ అయ్యారన్నది న్యూస్.

వరుసగా స్పెషల్ సాంగులు చేయను. మనసుకు మరీ దగ్గరనిపించి, చేసి తీరాల్సిందేననే ఫీలింగ్ వస్తే మాత్రమే దాని గురించి ఆలోచిస్తానని ఆల్రెడీ చెప్పేశారు శ్రీలీల. మరి గురువుకు తగ్గ శిష్యుడు బుచ్చిబాబు చెప్పిన కాన్సెప్ట్ నచ్చి ఓకే చెప్పేశారా? లేక పెండింగ్‌లో పెట్టారా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్

శ్రీలీల ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా అది వార్తే అవుతుంది. పుష్ప2 స్పెషల్ సాంగ్ గురించి కూడా మొదటి నుంచీ ఇలాంటి డిస్కషన్ జరుగుతూనే ఉండేది. చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి.

ఇప్పుడు పెద్ది విషయంలోనూ అదే ఫార్ములా రిపీట్ అవుతోంది. అన్నట్టు.. పుష్ప స్పెషల్ సమంతతో పెద్దిలో ఐటమ్ సాంగ్ చేయిస్తే.. ఈ థాట్ మేకర్స్ మనసులో ఉందో లేదో గానీ.. ఒకవేళ ఉంటే మాత్రం... పెద్దిలో.. రంగస్థలం ఫ్లేవర్ పక్కాగా ఫిట్ అవుతుంది. ఇంతకీ మీరేమంటారు? ఊ అంటారా? ఉఊ అంటారా?




