- Telugu News Photo Gallery Cinema photos Heroines like srinidhi shetty janhvi kapoor pooja hegde decreasing screen timing in movies
కమర్షియల్ సినిమాల్లో తగ్గుతున్న హీరోయిన్ స్క్రీన్ టైమ్
కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్ల స్క్రీన్ టైమ్ గురించి గట్టిగానే డిస్కషన్ జరుగుతోంది. సినిమాలో హీరోయిన్ లేరా అంటే.. ఉన్నారనే మాట వినిపిస్తోంది.! ఎంత సేపు ఉన్నారు అని అడిగితే మాత్రం ఆన్సర్ కాస్త ఆలోచించే చెప్పాల్సి వస్తోంది. జాన్వీ సౌత్ ఎంట్రీ కోసం చాలా ఎదురుచూశారు ఆడియన్స్. దేవరలో తంగం కేరక్టర్ అదిరిపోతుందంటూ ప్రీ రిలీజ్ టైమ్‌లో జాన్వీ కూడా చాలా బాగా చెప్పారు.
Updated on: May 12, 2025 | 9:49 PM

జాన్వీ సౌత్ ఎంట్రీ కోసం చాలా ఎదురుచూశారు ఆడియన్స్. దేవరలో తంగం కేరక్టర్ అదిరిపోతుందంటూ ప్రీ రిలీజ్ టైమ్‌లో జాన్వీ కూడా చాలా బాగా చెప్పారు.

కానీ, సినిమా చూసిన తర్వాత.. జాన్వీ సినిమాలో ఉన్నట్టా? లేనట్టా అని మాట్లాడుకున్నారంటే.. హీరోయిన్ కేరక్టర్ నిడివి ఎంత తక్కువో అర్థం చేసుకోవచ్చు. అలాంటి మాటలే ఇప్పుడు శ్రీనిధి శెట్టి విషయంలోనూ వినిపిస్తున్నాయి.

అర్జున్ సర్కార్.. ఒక్క మృదుల మాట మాత్రమే వింటారు.. అదీ మృదుల పవర్ అంటూ హిట్3 ప్రీ రిలీజ్ టైమ్ లో గట్టిగా చెప్పారు శ్రీనిధి శెట్టి. నేను, శ్రీనిధి కలిసి సినిమాను ప్రమోట్ చేస్తున్న తీరు చూసి ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయని అనుకోవద్దని ముందే హింట్ ఇచ్చారు నేచురల్ స్టార్.

నాని చెప్పినట్టే జరిగింది. సినిమాలో శ్రీనిధి పెర్ఫార్మెన్స్ చూపించడానికి స్క్రీన్ టైమ్ పెద్దగా లేదనే మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. సేమ్ టాపిక్ రెట్రో విషయంలోనూ వినిపిస్తోంది. పూజా హెగ్డే నేచురల్‌గా కనిపించినా, ఆమె కేరక్టర్ గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదనే మాటలే వినిపించాయి.

నెక్స్ట్ జననాయగన్ విషయంలోనైనా పూజా కాస్త కేర్ తీసుకుంటే బావుంటుందనే సలహాలు వినిపిస్తున్నాయి. కమర్షియల్ సినిమాల్లో నాయికలకు ఇంతకు మించిన స్క్రీన్ టైమ్ అన్ని సందర్భాల్లోనూ సాధ్యం కాకపోవచ్చనే వెర్షన్ ఇంకోవైపు వినిపిస్తోంది.




