పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరియమైంది శ్రీలీల. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెలుగు వెండితెరకు పరిచయం చేసిన ఈ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా గడిపేస్తుంది. ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు అరడజనుకు పైగా సినిమాలు చేస్తూ ఏడాదిలోనే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్లలో పాల్గొంటుంది. నందమూరి హీరో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో బాలయ్య కూతురిగా శ్రీలీల కనిపించనుంది.