- Telugu News Photo Gallery Cinema photos Spiritual elements are connecting the North and the South films
Nikhil Vs Teja Sajja: ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
రీజినల్ హీరోలు నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకోవాలంటే సెలక్ట్ చేసుకునే కంటెంట్ సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఉండాల్సిందే. అందులోనూ భగవంతుడు అనే కాన్సెప్ట్... ప్యాన్ ఇండియా ప్రేక్షకులు చాలా త్వరగా కనెక్ట్ కావడానికి రీసెంట్ టైమ్స్ లో హెల్ప్ అవుతోంది. మన దగ్గర నిఖిల్, తేజ సజ్జా, కన్నడ నుంచి రిషబ్ శెట్టి ఇలాంటి కాన్సెప్టులతోనే నార్త్ లో గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు. తేజ సజ్జా హీరోగా 40 కోట్లతో తెరకెక్కిన హనుమాన్ సినిమా 330 కోట్లు రిటర్న్స్ తెచ్చుకుంటే చూసి సంబరపడిపోయారు ట్రేడ్ పండిట్స్.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Apr 19, 2024 | 9:46 PM

రీజినల్ హీరోలు నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకోవాలంటే సెలక్ట్ చేసుకునే కంటెంట్ సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఉండాల్సిందే. అందులోనూ భగవంతుడు అనే కాన్సెప్ట్... ప్యాన్ ఇండియా ప్రేక్షకులు చాలా త్వరగా కనెక్ట్ కావడానికి రీసెంట్ టైమ్స్ లో హెల్ప్ అవుతోంది. మన దగ్గర నిఖిల్, తేజ సజ్జా, కన్నడ నుంచి రిషబ్ శెట్టి ఇలాంటి కాన్సెప్టులతోనే నార్త్ లో గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు.

తేజ సజ్జా హీరోగా 40 కోట్లతో తెరకెక్కిన హనుమాన్ సినిమా 330 కోట్లు రిటర్న్స్ తెచ్చుకుంటే చూసి సంబరపడిపోయారు ట్రేడ్ పండిట్స్. ఈ సినిమాకు కొనసాగింపుగా జై హనుమాన్‌ని తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ వర్మ. ఇందులోనూ తేజ సజ్జా కేరక్టర్ ఉంటుంది. జైహనుమాన్‌తో పాటు మిరాయ్ అని ఓ సూపర్‌హీరో మూవీ చేస్తున్నారు తేజ.

తెలుగులో కార్తికేయ విషయంలోనూ ఇదే జరిగింది. కార్తికేయ ఫస్ట్ పార్ట్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో సెకండ్ పార్టు ప్యాన్ ఇండియా రేంజ్‌లో సౌండ్ చేసింది. త్వరలో ప్రేమలు సీక్వెల్‌కి ఎంత ఖర్చుపెడతారనే ఆసక్తి కనిపిస్తోంది జనాల్లో.

కన్నడ కాంతార విషయంలోనూ ఇదే జరిగింది. 16 కోట్లతో భూతకోల కాన్సెప్ట్ తో తెరకెక్కిన కాంతార దాదాపు 400కోట్లకు పైగా కలెక్ట్ చేసి డివైన్ బ్లాక్‌బస్టర్ అనిపించుకుంది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు ఏకంగా ఆస్కార్‌ని టార్గెట్ చేసింది టీమ్.

ఉత్తరాది హీరో రణ్‌బీర్ కపూర్... బ్రహ్మాస్త్ర సినిమా నుంచి మనకు చాలా బాగా తెలుసు. అంతకు ముందు ఆయన జస్ట్... బిగ్ ఫ్యామిలీ హీరోగానో, ఆలియా భర్తగానో... ఓ మోస్తరు హీరోగానో మాత్రమే పరిచయం. కానీ బ్రహ్మాస్త్ర ఆయన్ని దక్షిణాది ప్రేక్షకులకు ఘనంగా ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పుడు రామాయణంలోనూ, బ్రహ్మాస్త్ర సీక్వెల్స్ తోనూ మెప్పించడానికి రెడీ అవుతున్నారు రణ్‌బీర్.





























