పైగా జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి లాంటి సినిమాల తర్వాత చిరు చేస్తున్న పూర్తిస్థాయి సోషియో ఫాంటసీ డ్రామా ఇది. అన్నింటికీ మించి భోళా శంకర్ తర్వాత చిరు ఫ్యాన్స్ డీలా పడిపోయారు. ఓ వైపు ఒరిజినల్ స్టోరీస్‌తో రజినీ, కమల్, బాలయ్య లాంటి సీనియర్స్ వరస విజయాలు అందుకుంటుంటే.. చిరు మాత్రం రీమేక్స్ నమ్ముకుంటున్నారంటూ విమర్శలు వచ్చాయి. అందుకే చిరంజీవి కూడా ఆలోచనలో పడిపోయాడు.