- Telugu News Photo Gallery Cinema photos Sivaji Celebrates Actress Laya Gorty Birthday In A Grand Way, See Photos
Actress Laya: హీరోయిన్ లయ బర్త్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన బిగ్ బాస్ శివాజీ.. ఫొటోస్ ఇదిగో
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది లయ. అయితే పెళ్లి, పిల్లల కారణంగా చాలా ఏళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమైంది. మళ్లీ ఇప్పుడే రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తోంది. అలాగే పలు టీవీ షోల్లోనూ సందడి చేస్తోంది.
Updated on: Oct 22, 2025 | 10:31 PM

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మంగళవారం (అక్టోబర్ 21) తన పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు , నెటిజన్లు లయకు బర్త్ డే విషెస్ చెప్పారు.

ఇటీవలే నితిన్ నటించిన తమ్ముడు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది లయ. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం మరికొన్ని సినిమాల్లో నటిస్తూ బిజి బిజీగా ఉంటోందీ అందాల తార.

కాగా ప్రస్తుతం తన లక్కీ కోస్టార్ శివాజీతో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది లయ. ఈ క్రమంలోనే లయ పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు శివాజీ.

అనంతరం ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు లయకు మరోసారి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

కాగా గతంలో లయ- శివాజీ కాంబినేషన్ లో టాటా బిర్లా మధ్యలో లైలా, మిస్సమ్మ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఈ జోడీ కట్టనుండడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది.




