సిల్క్ స్మిత.. పరిచయం అక్కర్లేని పేరు. 80, 90 దశకాల్లో ఈమె పేరు వినిపిస్తే చాలు సినిమా థియేటర్స్ నిండిపోయేవి. సిల్క్ బొమ్మ స్క్రీన్ మీద కనిపిస్తే కలెక్షన్లు వాటంతటవే వచ్చేవి. ఆమె లేకపోతే కనీసం సినిమాలు కూడా కొనేవాళ్లు కాదు బయ్యర్లు. అలాంటి ఇమేజ్ సొంతం చేసుకుని.. చివరికి ఒంటరిగా జీవితాన్ని చాలించారు సిల్క్ స్మిత.