- Telugu News Photo Gallery Cinema photos Sequels Movies Effect on budget and runtime in film industry Telugu Entertainment Photos
Sequels Movies: బాహుబలి నుండి కాంతారా వరకు సీక్వెల్స్ విషయంలో ఏం జరుగుతుంది.?
ఓ సినిమా కోసం రెండేళ్లు తీసుకుంటేనే నిర్మాతలకు కంగారు పెరుగుతుంది.. బడ్జెట్ చేతులు దాటిపోతుందనే భయం మొదలవుతుంది. కానీ సీక్వెల్స్ కోసం ఏళ్లకేళ్ళు ఎలా తీసుకుంటున్నారు.. తీసుకుంటున్నా నిర్మాతలు అంత నిశ్చింతగా ఎలా ఉంటున్నారు..? అసలు ఇదేం లాజిక్..? సీక్వెల్స్‌కు బడ్జెట్ పెరిగితే మేకర్స్‌కు కంగారు ఉండదా..? అసలేం జరుగుతుంది సీక్వెల్స్ విషయంలో..? ఈ రోజుల్లో స్టార్ హీరోతో సినిమా అంటే కనీసం ఏడాది ఖాయం. తీసేది ఫ్యామిలీ సినిమా అయినా కనీసం ఏడాది తీసుకుంటున్నారు.
Updated on: Dec 14, 2023 | 2:50 PM

ఓ సినిమా కోసం రెండేళ్లు తీసుకుంటేనే నిర్మాతలకు కంగారు పెరుగుతుంది.. బడ్జెట్ చేతులు దాటిపోతుందనే భయం మొదలవుతుంది. కానీ సీక్వెల్స్ కోసం ఏళ్లకేళ్ళు ఎలా తీసుకుంటున్నారు.. తీసుకుంటున్నా నిర్మాతలు అంత నిశ్చింతగా ఎలా ఉంటున్నారు..?

అసలు ఇదేం లాజిక్..? సీక్వెల్స్‌కు బడ్జెట్ పెరిగితే మేకర్స్‌కు కంగారు ఉండదా..? అసలేం జరుగుతుంది సీక్వెల్స్ విషయంలో..? ఈ రోజుల్లో స్టార్ హీరోతో సినిమా అంటే కనీసం ఏడాది ఖాయం. తీసేది ఫ్యామిలీ సినిమా అయినా కనీసం ఏడాది తీసుకుంటున్నారు. ఇక విజువల్ బేస్డ్ ప్రాజెక్ట్ అయితే రెండు మూడేళ్లైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇదే టైమ్‌లో సీక్వెల్స్ కోసం చాలా టైమ్ తీసుకుంటున్నారు దర్శకులు. ఒకటి రెండు కాదు.. ఒక్కో సీక్వెల్ కోసం మూడేళ్ళకు పైగానే తీసుకుంటున్నారు. పుష్ప 2, కాంతార 2నే దీనికి నిదర్శనం. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ తెరకెక్కిస్తున్న కాంతార 2 కోసం 150 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు మేకర్స్.

ఫస్ట్ పార్ట్ కేవలం 17 కోట్లతో తెరకెక్కితే.. సీక్వెల్ కోసం ఏకంగా 10 రెట్లు బడ్జెట్ పెంచేసారు. అయినా కూడా నిర్మాతలకు టెన్షన్ లేదు.. టైమ్ ఎంత తీసుకున్నా ఆ బిజినెస్ అలా ఉంది. కాంతార 400 కోట్లు వసూలు చేసింది.. సీక్వెల్ టార్గెట్ 1000 కోట్లు ఇప్పుడు. ప్రస్తుతానికి షూటింగ్ వేగంగా జరుగుతుంది.

అల్లు అర్జున్‌తో పాటు సమంత ఆడి పాడిన ఊ అంటావా... పాట సౌత్ నార్త్ ఆడియన్స్‌ను షేక్ చేసింది. అందుకే సీక్వెల్‌లోను అలాంటి ఓ పాటను ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్. తాజాగా ఆ పాట షూటింగ్ మొదలైంది.

గతంలో బాహుబలి 2, కేజియఫ్ 2, గదర్ 2 లాంటి వాటి కోసం ఎంత టైమ్ తీసుకున్నా.. వెయిట్ ఫర్ వర్త్ అన్నట్లే వాటి రిజల్ట్స్ వచ్చాయి.




