- Telugu News Photo Gallery Cinema photos Senior Heroines waiting for hit movie after long gap kajal agarwal with satyabhama Telugu Actress PHotos
Senior Heroines: హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
కంపేరిజన్ ఎందుకు అని ఒక వైపు మనసుకు ఎంత నచ్చజెప్పుకున్నా, పీర్ గ్రూప్‌తో ఏదో ఒక రకంగా కంపేర్ చేసుకోకుండా ఉండలేదు గ్లామర్ ఇండస్ట్రీ. ఇప్పుడు నయనతార, త్రిష సూపర్‌డూపర్ సక్సెస్‌లు చూస్తూ దూసుకుపోతుంటే, చాలా మంది సమకాలీనులు తామెక్కడున్నామో ఓ సారి రియాలిటీ చెక్ చేసుకుంటున్నారు. త్రిష, నయన్ తర్వాతి బ్యాచ్‌లో బాగా ఎలివేట్ అయిన హీరోయిన్లు తమన్నా,
Updated on: Apr 23, 2024 | 8:58 PM

కంపేరిజన్ ఎందుకు అని ఒక వైపు మనసుకు ఎంత నచ్చజెప్పుకున్నా, పీర్ గ్రూప్‌తో ఏదో ఒక రకంగా కంపేర్ చేసుకోకుండా ఉండలేదు గ్లామర్ ఇండస్ట్రీ. ఇప్పుడు నయనతార, త్రిష సూపర్‌డూపర్ సక్సెస్‌లు చూస్తూ దూసుకుపోతుంటే, చాలా మంది సమకాలీనులు తామెక్కడున్నామో ఓ సారి రియాలిటీ చెక్ చేసుకుంటున్నారు.

ప్రముఖ విద్వాంసురాలి చరిత్రను తరతరాలు గుర్తుపెట్టుకునేలా భారీ వ్యయంతో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది సిల్వర్‌స్క్రీన్స్ మీదకు తీసుకురావాలన్నది మేకర్స్ ప్లాన్.

హెల్త్ ఇష్యూస్‌తో సామ్ కాస్త బ్రేక్ తీసుకున్నప్పటికీ, ఇప్పటికీ ఆమె సినిమాలు చేస్తానంటే క్యూలో నిలుచునే నిర్మాతలు కోకొల్లలు. అంత డిమాండ్ క్రియేట్ చేసుకున్నారు ఈ చెన్నై బ్యూటీ.

సమంతతో ఈక్వెల్‌గా, ఆ మాటకొస్తే కాస్త ఎక్కువగానే కెరీర్‌ని చూసిన నటి కాజల్. ఆమె కీ రోల్ చేసిన సత్యభామ మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇండియన్2 గురించి మాట్లాడుకోవాలంటే ఆ క్రెడిట్ శంకర్‌నీ, కమల్‌నీ దాటుకుని కాజల్ వరకూ రావడం అయ్యేపని కాదు.

భారీ మల్టీస్టారర్ భక్తకన్నప్ప పరిస్థితి కూడా అలాంటిదే. కాబట్టి, సత్యభామతో ఎలాగైనా సక్సెస్ కొట్టి చూపించాలని తాపత్రయపడుతున్నారు కాజల్. రీసెంట్‌గా స్పెషల్ సాంగ్‌తో జైలర్‌లో హల్‌చల్ చేసినప్పటికీ, తమన్నాకి అరణ్మణై4 సినిమా సక్సెస్ అత్యంత కీలకం.

బాక్ పేరుతో తెలుగులో విడుదలవుతోంది ఈ సినిమా. సత్యభామ, బాక్ ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయినా వీరిద్దరి నెక్స్ట ప్రాజెక్టుల మీద ఆ నష్టం భారీగా ఉంటుందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో. కెరీర్ మళ్లీ వెలగాలంటే ఈ సినిమాల సక్సెస్ కంపల్సరీ అంటున్నారు క్రిటిక్స్.





























