జాతిరత్నాలు తర్వాత రావణాసుర, లైక్ షేర్ సబ్ స్క్రైబ్ సినిమాలతో మరిన్ని హిట్స్ ఖాతాలో వేసుకుంది. నటిగానే కాకుండా డాన్సర్ గానూ మెప్పించింది. ఇటీవల వాసివాడి తస్సాదియ్యా పాటకు నాగార్జున, నాగచైతన్యతో కలిసి డాన్స్ అదరగొట్టింది. సినిమాల్లోకి రాకముందు థియేటర్ ఆర్టిస్ట్ గా, మోడల్ గా పనిచేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.