- Telugu News Photo Gallery Cinema photos Senior actress shriya saran shared her latest black dress photos
42ఏళ్ల వయసులోనూ కుర్రహీరోయిన్స్ కు గట్టి పోటీ ఇస్తున్న శ్రియ.. ఫోటోలు అదుర్స్
తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో శ్రియ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు సినిమాల్లో సహయ నటిగా కొనసాగుతుంది. ప్రస్తుతం శ్రియా వయసు 42 సంవత్సరాలు.
Updated on: Aug 11, 2025 | 1:55 PM

తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో శ్రియ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు సినిమాల్లో సహయ నటిగా కొనసాగుతుంది.

ప్రస్తుతం శ్రియా వయసు 42 సంవత్సరాలు. ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీగా ఏమాత్రం తరగని అందంతో మెస్మరైజ్ చేస్తోంది శ్రియా. ఈ క్రమంలోనే తాజాగా తన ఫిట్నెస్, డైట్ ప్లాన్ రివీల్ చేసింది ఈ ముద్దుగుమ్మ.ఇప్పటికీ కుర్ర హీరోయిన్స్ కుళ్ళుకునేలా ఉంది ఈ బ్యూటీ.

ప్రతిరోజు కఠినమైన వ్యాయమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తానని తెలిపింది శ్రియా. అలాగే తన దినచర్యలో యోగా కచ్చితంగా ఉండాల్సిందే అని.. మానసిక ప్రశాంతత కోసం నిత్యం యోగాసనాలు చేస్తానని తెలిపింది ఈ వయ్యారి భామ.

అలాగే స్విమ్మింగ్, డ్యాన్స్ ఎప్పుడూ తనను మానసిక ప్రశాంతంగా ఉండేలా చేస్తుందని చెప్పుకొచ్చింది. వ్యాయామం చేసే ముందు తినడం వల్ల తనకు తగినంత శక్తి వస్తుందని.. తేలికైనా ఆహారం తీసుకోవడానికి ఇష్టపడతానని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

బాదం స్థిరమైన శక్తిని, అరటిపండ్లు కార్పోహైడ్రేట్ బూస్ట్ అందిస్తాయని తెలిపింది. అలాగే బెర్రీలు, అవిసె గింజలతో చేసిన స్మూతీ, ఎక్కువగా నీరు తీసుకుంటానని తెలిపింది. ఇంట్లో తయారు చేసిన స్నాక్ తీసుకుంటానని చెప్పుకొచ్చింది.




