- Telugu News Photo Gallery Cinema photos Seethamma Vakitlo Sirimalle Chettu Child Artist Rachana Shares Beautiful Half Saree Photos
Tollywood: ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత అందంగా ఉందో చూశారా..? అచ్చం బాపు బొమ్మలా ఉందిగా..
విక్టరీ వెంకటేశ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో అంజలి, సమంత హీరోయిన్లుగా నటించారు. అయితే ఇదే సినిమాతో చాలా ఫేమస్ అయిన చైల్డ్ ఆర్టిస్ట్ రచన. ఈ మూవీలో సమంత ఫ్యామిలీలోని అల్లరి అమ్మాయిగా కనిపించింది రచన.
Updated on: Sep 04, 2024 | 5:49 PM

విక్టరీ వెంకటేశ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో అంజలి, సమంత హీరోయిన్లుగా నటించారు. అయితే ఇదే సినిమాతో చాలా ఫేమస్ అయిన చైల్డ్ ఆర్టిస్ట్ రచన.

ఈ మూవీలో సమంత ఫ్యామిలీలోని అల్లరి అమ్మాయిగా కనిపించింది రచన. ‘ఏంటీ కూలెక్కలేదా వాటరు’ అనే డైలాగ్తో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్ అయ్యింది. గోదావరి యాసలో ఆమె పలికిన డైలాగ్ గుర్తింపు తెచ్చిపెట్టింది.

అయితే ఈ సినిమా తర్వాత మరో మూవీలో నటించలేదు రచన. 2019లో పెళ్లి చేసుకున్న రచన.. 2020లో ఓ పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తన భర్తతో కలిసి సింగపూర్ లో ఉంటుంది రచన. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఫోటోషూట్, రీల్స్ షేర్ చేస్తుంది రచన. పొడవాటి జడ.. చందమామ లాంటి మోము.. కలువ లాంటి కళ్లతో లంగావోణిలో అచ్చం బాపుగారి బొమ్మలా కనిపిస్తుంది.

తాజాగా నెట్టింట రచన షేర్ చేసిన ఫోటోస్ చూసి అవాక్కవుతున్నారు నెటిజన్స్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కనిపించిన చిన్నారి ఇప్పుడు ఇంతగా మారిపోయిందా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.




