సంజయ్ లీలా భన్సాలీ.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. భాషతో సంబంధం లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ దర్శకుడి సొంతం. 30 ఏళ్ళ కెరీర్‌లో చేసింది 10 సినిమాలే అయినా.. ఖామోషీ, హమ్ దిల్ దే చుకే సనమ్ నుంచి పద్మావత్, గంగూభాయ్ కతియావాడి వరకు భన్సాలీ సినిమా అంటే ఓ మ్యాజిక్. అందుకే ఆయన మూవీస్‌కు కల్ట్ ఫాలోయింగ్ ఉంటుంది.