- Telugu News Photo Gallery Cinema photos Samantha Temple grand opening on her birthday by fan in Alapadu, Bapatla District See Photos Telugu film news
Samantha Temple: ఏపీలో సమంత కోవెల ఆవిష్కృతమైంది.. నటి పుట్టిన రోజున గ్రాండ్‌గా.. ఫోటోలు చూశారా
సినీ తారలను కొందరు విపరీతంగా అభిమానిస్తారు. ఇంకొదరైతే భక్తులుగా మారి ఆరాధిస్తారు. ఇకొందరు వీరాభిమానులైతే అవకాశం వచ్చినప్పుడల్లా ఏదో ఒక రూపంలో తమ అభిమానాన్ని ప్రదర్శిస్తారు. సినిమా రిలీజ్‌లను ఓ పండగలా చేస్తారు. అంతలా ప్రేమను కురిపిస్తారు ఫ్యాన్స్. తాజాగా ఓ వీరాభిమాని నటి సమంతపై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు.
Updated on: Apr 28, 2023 | 1:30 PM

బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడుకు చెందిన సందీప్ సమంతకు పెద్ద ఫ్యాన్. 2010లో వచ్చిన ఏంమాయ చేశావో సినిమా నుండి సమంత వీరాభిమానిగా మారాడు. అంతే కాకుండా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడంలో సమంత చూపిన చొరవ సమంత చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఫిదా అయ్యాడు.

దీంతో అప్పటి నుండి సమంత కోసం ఏదో ఒకటి చేయాలని సందీప్ ఆలోచించి.. అభిమానాన్ని చాటుకునేందుకు ఏకంగా ఆమెకు గుడి కట్టాడు.

తన ఇంటిలోనే కట్టిన ఈ గుడిని శుక్రవారం సమంత పుట్టినరోజు లోపు సందర్భంగా అంగరంగ వైభవంగా ప్రారంభించాడు. కేక్ కట్ చేసి.. అందరికీ భోజనాలు పెట్టాడు.

అనారోగ్యం పాలైన చిన్న పిల్లలకు పునర్జన్మ ప్రసాదిస్తున్న సమంతపై అభిమానం రెట్టింపవ్వడంతో గుడి కట్టినట్లు సందీప్ తెలిపాడు.

ఇదీ మాత్రమే కాదు సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడినప్పుడు కూడా సామ్ త్వరగా కోలుకోవాలంటూ మొక్కుబడి యాత్ర చేశాడు సందీప్. సామ్ కోసం తిరుపతి, చెన్నై, నాగపట్నంలో యాత్ర చేశాడు సందీప్.

ఇప్పటి వరకూ సమంతను నేరుగా చూడలేదని, కేవలం ఆమెపై అభిమానంతోనే గుడి నిర్మించానని.. ఆమెను కలిసే అవకాశం వస్తే అది తనకు మహత్భాగ్యమని సందీప్ వెల్లడించాడు.

గతంలో తమిళనాట హీరోయిన్స్ ఖుష్బు, నమితలకు గుడి కట్టారు అభిమానులు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటన జరగడం ఇదే ఫస్ట్ టైమ్.




