- Telugu News Photo Gallery Cinema photos Samantha Says About Allu Arjun's Daughter Allu Arha Role in Shaakuntalam telugu cinema news
Allu Arha: మల్టీటాలెంటెడ్ గర్ల్ అల్లు అర్హ.. శాకుంతలంలో అర్హ పాత్ర అద్భుతమట..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం శాకుంతలం. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Updated on: Apr 09, 2023 | 9:47 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం శాకుంతలం. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

శకుంతల దుష్యంతుల అమర ప్రేమగాథను వెండితెరపైకి తీసుకువస్తున్నారు డైరెక్టర్ గుణశేఖర్. ఇందులో సమంత.. శకుంతలగా.. దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాతోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ తెలుగు తెరకు బాలనటిగా పరిచయం కాబోతుంది. ఇందులో భరతుడి పాత్రలో కనిపించనుంది అర్హ.

ఇటీవల ఈ మూవీ ప్రమోషన్లలో అర్హ గురించి సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అర్హ పుట్టుకతోనే సూపర్ స్టార్ అని అన్నారు.

"అల్లు అర్హ స్వయంస్వతంత్రురాలు. తనకు కావాల్సిన నిర్ణయాలు తానే తీసుకోగలదు. ఆమె విషయాల్లో అర్జున్ కలగజేసుకోవాల్సిన అవసరం లేదు. ఆమె కెరీర్ విషయంలోనూ అతని జోక్యం అవసరం లేదు" అని అన్నారు సమంత.

అర్హ కెరీర్‌లో ఇది అద్భుతమైన చిత్రం. అర్హ రోల్ చాలా అద్భుతంగా వచ్చింది. లీడ్ కేరక్టర్లన్నీ ఒక ఎత్తు, అర్హ రోల్ మరో ఎత్తు. అంత బాగా వచ్చింది. అందుకే పిల్లలు, ఫ్యామిలీస్ ఈ కథను ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను అంటూ చెప్పుకొచ్చారు సామ్.

ఇక మొదటి సినిమాతోనే వెండితెరపై అర్హ అద్భుతం చేయబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి అర్హ చాలా చురుకైన చిన్నారి.

Allu Arha: మల్టీటాలెంటెడ్ గర్ల్ అల్లు అర్హ.. శాకుంతలంలో అర్హ పాత్ర అద్భుతమట..

Allu Arha: మల్టీటాలెంటెడ్ గర్ల్ అల్లు అర్హ.. శాకుంతలంలో అర్హ పాత్ర అద్భుతమట..