Samantha: అందరూ సమానమే అంటున్న సామ్..ఏ విషయంలో?
సమంత ఇక సినిమాలు చేయరా? వెబ్ సీరీస్‌లకే పరిమితమవుతారా? మళ్లీ ప్రేమలో పడ్డారా? ఎవరితోనైనా రిలేషన్‌షిప్‌లో ఉన్నారా? పెళ్లి గురించి ఏమంటున్నారు? ఇలాంటి ప్రశ్నలు కోకొల్లలు. వీటన్నిటికీ యాజ్ ఇట్ ఈజ్‌గా కాకపోయినా ఆమె చెప్పిన చాలా విషయాలో సమంత చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నారనే ఫీలింగ్ కలిగిస్తున్నాయి.. ఇంతకీ ఏమంటున్నారు సామ్?
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Feb 07, 2025 | 2:45 PM

సమంత న్యూ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సరికొత్త హెయిర్ స్టైల్‌తో ఇంత వైవిద్యంగా కనిపిస్తున్నారేంటి? అనే మాటలు వినిపిస్తున్నాయి. అదేమైనా వెబ్ సీరీస్ కోసం ట్రై చేసి లుక్కా.. అని కూడా ఆరా తీస్తున్నారు. అయితే అవన్నీ సామ్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా తీసుకున్న పిక్స్.

హెల్త్ సహకరించకపోయినా, ఓపిక చేసుకుని మరీ సిటాడెల్‌ని కంప్లీట్ చేసి, ప్రమోషన్లలో పాల్గొన్నారు సామ్. ఇప్పుడు కూడా రక్త్ బ్రహ్మండ్‌లో నటిస్తున్నారు. మరోవైపు ఫ్యామిలీమేన్ నెక్స్ట్ చాప్టర్‌లోనూ సామ్ నటించారన్నది ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్న టాపిక్.

ఆ దర్శకద్వయంలో ఒకరితో సామ్ ప్రేమలో ఉన్నారన్న మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. హీరోయిన్‌గా సూపర్‌స్టేటస్‌ని ఎంజాయ్ చేసిన టైమ్‌లోనూ, హీరోతో పోలిస్తే, తన రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉండేదన్నది సామ్ చెబుతున్న మాట.

తన ప్రొడక్షన్ హౌస్‌లో అబ్బాయిలకు, అమ్మాయిలకు ఈక్వెల్ రెమ్యునరేషన్స్ పే చేస్తున్నాననీ, అమ్మాయిలకు మరింత భద్రత కల్పిస్తున్నానీ అంటున్నారు సామ్. ఇండస్ట్రీ అబ్బాయిలను, అమ్మాయిలను చూసే తీరులో మార్పు ఉంటుందన్నారు సామ్.

అమ్మాయిలు ఎవరు? ఎక్కడ నుంచి వచ్చారు? వారి వెనుక ఎవరున్నారు? వంటి విషయాలు ఎదుటివారిని చాలా ప్రభావితం చేస్తాయి. ఈ విషయాల్లో గైడ్ చేయడానికి నాకు కెరీర్ ప్రారంభంలో ఎవరైనా ఉంటే బావుండేది. అయినా ఫర్లేదులేండీ... నేను పడుతూ లేస్తూ అన్నీ నేర్చుకున్నాను.. అని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు ఈ బ్యూటీ.





























