- Telugu News Photo Gallery Cinema photos Rip Lata mangeshkar: 5 unknown facts about legendary singer lata mangeshkar
Lata Mangeskar: నటి నుంచి గాయనిగా.. తిరస్కారం నుంచి పురష్కారం వరకూ లతాజీ జీవితంలో ఎవరికి తెలియని ముఖ్య విషయాలు..
Lata Mangeshkar: లతా మంగేష్కర్ ను ప్రేమతో దీదీ,నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. తన గానంతో లతా కోట్ల మంది హృదయాలలో చోటు సంపాదించుకున్నారు. కోరనా బారిన పడిన లతాజీ అనారోగ్యంతో గత కొంతకాలంగా ఆసపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో ఈరోజు లతాజీ తుది శ్వాస విడిచారు. భారతదేశంలోని అత్యంత ప్రతిభావంతురాలైన గాయకురాలు.. లెజెండ్ సింగర్ గురించి ఎవరికీ తెలియని కొన్ని వాస్తవాలు గురించి ఈరోజు తెలుసుకుందాం
Updated on: Feb 06, 2022 | 1:52 PM

పండిట్ దీనానాథ్ మంగేష్కర్, (థియేటర్ నటుడు మరియు శాస్త్రీయ గాయకుడు), షేవాంతీ(శుద్ధమతి) దంపతులకు లతా మంగేష్కర్ 1929 సెప్టెంబర్ 28న జన్మించారు. లత అసలు పేరు హేమ. భావ్ బంధన్‌లోని లతిక పాత్ర తర్వాత లతగా పేరు మార్చుకున్నారు. లతా ఐదేళ్ల వయసులో పాడటం మొదలుపెట్టారు. ప్రసిద్ధ గాయకులు అమన్ అలీ ఖాన్ సాహిబ్, అమానత్ ఖాన్‌ల వద్ద సంగీత కళను అభ్యసించారు. లతా మంగేష్కర్ ప్లేబ్యాక్ సింగర్‌గా సినీ పరిశ్రమలోకి ప్రవేశించినప్పుడు.. మొదట ఆమె తిరస్కరించబడింది. ఆ సమయంలో నూర్ జెహాన్, శంషాద్ బేగంల హవా కొనసాగుతోంది. ఆ సమయంలో లతా దీదీ స్వరం ఆ సమయానికి చాలా సన్నగా ఉండేది. ఇక లత 1942-1948 వరకు ఎనిమిది చిత్రాలలో నటించారు. 1942లో తండ్రి మరణం లత జీవితంపై అత్యంత ప్రభావం చుపించింది. తన కుటుంబాన్ని పోషించడానికి సిని రంగ ప్రవేశం చేశారు. ఈ చిత్రాలలో విజయం సాధించలేదు. దీంతో మరాఠీ చలనచిత్రం కితీ హసల్ (1942)లో సింగర్ గా అడుగు పెట్టారు. అయితే ఈ పాట సినిమా ఎడిట్ లో తీసివేశారు. దీంతో లత మొదటి పాట ఇప్పటికీ వెలుగు చూడలేదు

మె ఏ మేరే వతన్ కే లోగోన్, జరా ఆంఖ్ మే భర్ లో పానీ అనే పాటను లత పడుతున్న సమయంలో భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను కంటతడి పెట్టారని చెబుతుంటారు. ఇది 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో భారతదేశం ఓడిపోయినప్పుడు జరిగిన సంఘటన. లార్డ్స్ స్టేడియంలో లత మంగేష్కర్ కు శాశ్వత గ్యాలరీ ఉంది. ఆ గ్యాలరీ నుంచి లతాజీ తనకు ఇష్టమైన ఆట-క్రికెట్‌ను చూసి ఆనందించేవారు. 1974లో లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ప్రదర్శన ఇచ్చిన మొదటి భారతీయురాలుగా ఖ్యతిగంచారు. నటి సైరా బానుకి తన వాయిస్ బాగా సూట్ అవుతుందని లతా నమ్మేవారని ఓ వార్త వినిపిస్తుండేది.

భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం- భారతరత్న.. ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న ఏకైక రెండవ గాయనిగాలతా నిలిచారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, మహారాష్ట్ర భూషణ్ అవార్డు, ఎన్టీఆర్ జాతీయ అవార్డు, భారతరత్న, ANR జాతీయ అవార్డు, మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు ఉన్నాయి. న్యూయార్క్ యూనివర్శిటీతో సహా ఆరు విశ్వవిద్యాలయాలు ఆమెకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశాయ

1999లో లతాజీ పార్లమెంటు సభ్యురాలిగా నామినేట్ చేయబడ్డారు. అయితే అనారోగ్యం కారణంగా రాజ్యసభలో సమావేశాలకు హాజరు కాలేదు. అప్పుడు ఇది చాలా వివాదాస్పదంగా మారింది, అయితే లతా దీదీ ఎంపీ పదవి ఎన్నడు ఎ విషయంలోనూ ఉపయోగించుకోలేదు. ఒక్క పైసా లేదా జీతం తీసుకోలేదు. ఇల్లు తీసుకోలేదు. 2005 కాశ్మీర్ భూకంపం సహాయం కోసం లతా మంగేష్కర్ భారీ డబ్బును విరాళంగా ఇచ్చారు.




