Rashmika Mandanna: రెమ్యునరేషన్ పెంచేసిన రష్మిక.. ఆ సినిమాలోని సీన్స్ కోసం అంతా తీసుకుంటుందా ?..
ప్రస్తుతం తెలుగు, హిందీ సినీ పరిశ్రమలో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఇప్పుడు ఆమె నటిస్తోన్న చిత్రాలు యానిమల్, పుష్ప. రెండు భారీ బడ్జెట్ చిత్రాలు కావడం విశేషం. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక కలిసి నటిస్తోన్న సినిమా యానిమల్. ఈ సినిమాపై ఇప్పటికే భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ అమ్మాయి సాంగ్ రిలీజ్ చేశారు. పాటకు హిందీతోపాటు తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది.