- Telugu News Photo Gallery Cinema photos Rashmika Mandanna Female Centric Film With Director Rahul Ravindran Keerthi Suresh Bollywood Debut
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక.. బాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్న కీర్తి సురేష్
రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగు కంటే ఎక్కువగా బాలీవుడ్ సినిమాలపైనే ఫోకస్ చేసారు. ప్రస్తుతం ఈమె పుష్ప 2తో పాటు మరికొన్ని సినిమాలు సైన్ చేసారు. ఇదిలా ఉంటే లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్స్‌ను సైతం ఎక్కువగా ఓకే చేస్తున్నారు రష్మిక. ఈ క్రమంలోనే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈమె ఓ సినిమా సైన్ చేసినట్లు తెలుస్తుంది. లెజండరీ క్రికెటర్, శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా 800. ఈ చిత్రంలో స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్ మధుర్ మిట్టల్ లీడ్ రోల్ చేస్తున్నారు.
Updated on: Sep 27, 2023 | 1:58 PM

Rashmika Mandanna: రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగు కంటే ఎక్కువగా బాలీవుడ్ సినిమాలపైనే ఫోకస్ చేసారు. ప్రస్తుతం ఈమె పుష్ప 2తో పాటు మరికొన్ని సినిమాలు సైన్ చేసారు. ఇదిలా ఉంటే లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్స్‌ను సైతం ఎక్కువగా ఓకే చేస్తున్నారు రష్మిక. ఈ క్రమంలోనే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈమె ఓ సినిమా సైన్ చేసినట్లు తెలుస్తుంది.

800: లెజండరీ క్రికెటర్, శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా 800. ఈ చిత్రంలో స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్ మధుర్ మిట్టల్ లీడ్ రోల్ చేస్తున్నారు. ఎంఎస్ శ్రీపతి కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై వివేక్ రంగచారి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది.

NC23: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కిస్తున్న సర్వైవల్ థ్రిల్లర్ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే జాలరుల నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఈ పాత్ర కోసం చైతూ కూడా చాలా మారిపోతున్నారు. అలాగే సాయి పల్లవి పాత్ర కూడా కొత్తగా ఉంటుందంటున్నారు మేకర్స్. ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు.

Skanda: రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమా స్కంద. ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. తాజాగా రిలీజ్ ట్రైలర్ కూడా విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ సినిమా కల్ట్ జాతర కరీంనగర్‌లో జరగనుంది. అక్కడే భారీ ఈవెంట్‌ను నిర్వహించనుంది చిత్రయూనిట్. సెప్టెంబర్ 25 సాయత్రం 6 గంటల నుంచి వి.కన్వెన్షన్‌లో స్కంద కల్ట్ జాతర జరగనుంది.

Keerthy Suresh: సౌత్‌లో ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కీర్తి సురేష్ త్వరలోనే బాలీవుడ్‌కు వెళ్లనున్నారు. అక్కడ వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కుతున్న తెరీ రీమేక్‌లో హీరోయిన్‌గా ఎంపికయ్యారు. అట్లీ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆయన శిష్యుడు తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు బయటికి రానున్నాయి. కీర్తితో పాటు వామికా గబ్బీ ఇందులో మరో హీరోయిన్‌గా నటించబోతున్నారు.




