- Telugu News Photo Gallery Cinema photos Pushpa Director Sukumar Finally Reveals Story Behind The Naming Of Allu Arjun’s Titular Character know the details here
Pushpa: పుష్పరాజ్.. రియల్ లైఫ్ క్యారెక్టరా !! రివీల్ చేసిన సుకుమార్
పుష్ప 2 రిలీజ్ తరువాత చాలా రోజులకి మరోసారి పుష్పరాజ్ గురించి మాట్లాడారు దర్శకుడు సుకుమార్. చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్న లెక్కల మాస్టర్.. అసలు పుష్ప కథకు మూలం ఏంటి..? పుష్పరాజ్ క్యారెక్టర్‌కు ఇన్‌స్పిరేషన్ ఎవరు అన్నది రివీల్ చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Apr 05, 2025 | 12:31 PM

పుష్ప అంటే బ్రాండ్ అన్నది దేశం మొత్తం ఒప్పుకుంది. తెలుగుతో పాటు హిందీలోనూ సూపర్ హిట్ అయిన పుష్ప 2 బాక్సాఫీస్ లెక్కలు మార్చేసింది. ఇన్నాళ్లు నాన్ బాహుబలి రికార్డ్స్ అంటూ చెప్పుకున్న ఇండస్ట్రీని నాన్ పుష్ప 2 రికార్డ్స్ అని చెప్పుకునేలా చేసింది.

అయితే ఇంతటి సక్సెస్‌ఫుల్ సినిమా తెర మీదకు రావడానికి ఇన్‌స్పిరేషన్ ఎవరు? ఈ విషయాన్నే రివీల్ చేశారు దర్శకుడు సుకుమార్. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఓ డాక్యుమెంటరీ ప్లాన్ చేసిన సుకుమార్, అందుకోసం చాలా రిసెర్చ్ చేశారు.

ఆ టైమ్‌లోనే పుష్పరాజ్ అనే వ్యక్తిని కలిశారు. అతన్ని అందరూ పుష్ప... పుష్ప అని పిలుస్తుండటంతో అల్లు అర్జున్‌తో సినిమా అనుకున్న తరువాత అదే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు సుక్కు.

ఇంటర్వ్యూలో పుష్ప 3 గురించి మాట్లాడారు సుకుమార్. పార్ట్ 3లో అల్లు అర్జున్‌తో పాటు విజయ్ దేవరకొండ, నాని కనిపిస్తారన్న ప్రచారం జరుగుతుంది.. నిజమేనా అన్న ప్రశ్నకు అది 2025లో ఉన్న సుకుమార్‌కు తెలియదు.. 2026లో స్క్రిప్ట్ రాయబోయే సుకుమార్‌ను అడగాలి అంటూ తనదైన స్టైల్‌లో సమాధానం దాటవేశారు.

అయితే సుకుమార్ రెడీ అయినా... బన్నీ ఇప్పట్లో పుష్ప 3కి డేట్స్ ఇచ్చే పరిస్థితి కనిపించటం లేదు. ఆల్రెడీ అట్లీ, త్రివిక్రమ్ సినిమాలు కమిట్ అయిన ఐకాన్ స్టార్, ఆ రెండు సినిమాలు పూర్తి చేయడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. ఆ తరువాతే కొత్త సినిమా గురించి ఆలోచిస్తారు. అంటే 2027 వరకు బన్నీ మరో సినిమాకు కమిట్ అయ్యే ఛాన్స్ లేదు. ఆ తరువాతే పుష్ప 3 గురించి ఆలోచించాలి.





























