- Telugu News Photo Gallery Cinema photos Do You Know This Actress Who is Acted With Mahesh Babu In Srimanthudu Movie, Sanam Shetty Photos Goes Viral
Mahesh Babu: మహేష్ సినిమాలో కనిపించిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా..? అందాలతో సెగలు పుట్టిస్తోన్న వయ్యారి..
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. SSMB 29 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా మహేష్ బాబుకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరలవుతుంది.
Updated on: Apr 05, 2025 | 12:47 PM

మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో శ్రీమంతుడు ఒకటి. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2015లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటించగా.. మరో అమ్మాయి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.

తనే సనమ్ శెట్టి. ఈ సినిమాలో మహేష్ బాబుతో కలిసి కాఫీ తాగే సన్నివేశంలో కనిపిస్తుంది. కనిపించింది తక్కువ సమయమే అయినా మంచి పాపులారిటీని సొంతే చేసుకుంది. కానీ ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్.

సనమ్ ప్రసాద్ శెట్టి.. అంబులి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళంలో వరుస ఆఫర్స్ అందుకుంటూ అక్కడే బిజీ హీరోయిన్ గా మారింది. శ్రీమంతుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ వయ్యారి.

ఆ తర్వాత సంపూర్ణేష్ బాబు నటించిన సింగం 123, ప్రేమికుడు సినిమాల్లో నటించింది. తమిళం, కన్నడ భాషలలో ఎక్కువగా నటించింది. ఆ తర్వాత పూర్తిగా తమిళంలో సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయిపోయింది.

ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో సనమ్ శెట్టి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమా ఆఫర్స్ కోసం తనకు నచ్చన పని చేయనని చెప్పేసింది.





























