- Telugu News Photo Gallery Cinema photos Pushpa Actor Daali Dhananjaya Marries Dhanyatha In Mysore, See Wedding Photos
Daali Dhananjaya: డాక్టరమ్మతో కలిసి పెళ్లిపీటలెక్కిన పుష్ప విలన్ జాలిరెడ్డి.. బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
ప్రముఖ కన్నడ నటుడు, పుష్ప ఫేమ్ డాలీ ధనంజయ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. డాక్టర్ ధన్యతతో కలిసి అతను ఏడడుగులు నడిచాడు. ఆదివారం (ఫిబ్రవరి 16) మైసూర్ వేదికగా వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. ప్రస్తుతం ఈ పెళ్లి వేడుక ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Updated on: Feb 16, 2025 | 3:11 PM

కన్నడ, తెలుగుతో పాటు పలు భాషల చిత్రాల్లో నటించిన డాలీ ధనంజయ తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. ధన్యతతో కలిసి అతను వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు.

ఆదివారం (ఫిబ్రవరి 16) మైసూరు వేదికగా ధనంజయ-ధన్యతల వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు, సన్నిహితులు, సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.

డాలీ ధనంజయ, ధన్యత లకు మైసూర్ చాలా ఇష్టమైన ప్రదేశం. వారు మొదటి సారి ఇక్కడే కలుసుకున్నారు కాబట్టి వివాహం ఇక్కడే జరిగింది. ఈ సందర్భంగా టెంపుల్ థీమ్‌లో వివాహ వేదికను అందంగా ముస్తాబు చేశారు.

డాలీ ధనంజయ నటుడిగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పుష్ప సినిమాలో విలన్‌గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక వధువు ధన్యత విషయానికి వస్తే.. ఆమె ఒక ప్రముఖ డెంటిస్ట్.

ధనంజయ-ధన్యతలది పెద్దలు కుదిర్చిన వివాహం. గతేడాది నవంబర్‌లో వీరు నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లిపీటలెక్కారు.

ధనుంజయ వివాహ వేడుకల ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.





























