ఏం అందంరా బాబు.. చీరలో నాని హీరోయిన్ అందాల విందు..
కన్నడ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓంధ్ కథే హెల్లా అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి నటిగా అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ, నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఈ సినిమాలో ఈ అమ్మడు తన అందం, నటనతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు లేవనే చెప్పాలి.
Updated on: Feb 14, 2025 | 3:56 PM

2019లో నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు అభిమానులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత, శ్రీకారం, సరిపోదా శనివారం సినిమాల్లో నటించి మెప్పించింది.

ఇందులో మరోసారి హీరో నాని సరసన సరిపోదా శనివారం సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే సినిమా హిట్ అయినా ఈ బ్యూటీకి మాత్రం తెలుగులో ఆశించిన రేంజ్ లో అవకాశాలు రాలేదనే చెప్పాలి.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. అంతే కాకుండా తెలుగులో కూడా ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ నటి ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ, ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటో షూట్స్‌తో కుర్రకారు మనసు దోచేస్తుంది. తాజాగా ఈ అమ్మడు చీరలో తన అందాలతో కుర్రకారుకు విందు ఇచ్చింది.

నెట్టెడ్ వైట్ శారీ కట్టుకొని, చమ్కీలతో చాలా కలర్ ఫుల్‌గా కనిపించింది. ఈ చీరలో ఈ అమ్మడు చూడ ముచ్చటగా కనిపస్తుంది. దీంతో ప్రస్తుతం శారీలో ఈ అమ్మడు అందానికి తన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. చీర కట్టులో చూడ ముచ్చటగా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ ఫొటోస్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి.





























