- Telugu News Photo Gallery Cinema photos Actress Regina Cassandra Says She Lost Many Offers Becuase Of Not Speaking Hindi
Tollywood: 25 ఏళ్లుగా సినిమాలు.. అయినా రానీ క్రేజ్.. ఆ కారణంతో ఆఫర్స్ కోల్పోయిందట..
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె బిజీ హీరోయిన్. తెలుగులో యంగ్ హీరోలు అందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం సరైన క్రేజ్ రాలేదు. ఇక చాలా కాలంగా ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంది. అయితే ఓ కారణంతో ఆమె సినిమా ఆఫర్స్ కోల్పోయిందంట.
Updated on: Feb 14, 2025 | 11:53 AM

సినీరంగంలోకి అడుగుపెట్టిన 14 ఏళ్ల తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం హిందీలో రెండు సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు.. ఒకప్పుడు తెలుగులో మాత్రం క్రేజీ హీరోయిన్. యంగ్ హీరోలు అందరి సరసన నటించింది. తనే రెజీనా కసాండ్రా.

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని హీరోయిన్ రెజీనా కసాండ్రా. తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ అమ్మడు నటించిన చిత్రాలన్ని సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఇప్పటికీ సరైన క్రేజ్ రాలేదు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రెజీనా.. బాలీవుడ్ ఇండస్ట్రీలో సౌత్ హీరోయిన్స్ కొనసాగడం కష్టమన్నారు. భాష రాకపోవడం వల్ల తాను ఎన్నో ఆఫర్స్ కోల్పోయినట్లుగా చెప్పుకొచ్చింది. తాను 9 ఏళ్ల వయసులోనే నటించడం ప్రారంభించినట్లు తెలిపింది.

తాను దాదాపు 25 ఏల్లుగా ఎన్నో సినిమాల్లో, ప్రకటనలలో నటించానని.. కాబట్టి తనకు ఇండస్ట్రీ మీద అవగాహన ఉన్నట్లు తెలిపింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో దక్షిణాది నటిగా కొనసాగడం చాలా కష్టమని..హిందీ సినిమాకు ఆడిషన్ కోసం వెళ్తే భాష ఎలా మాట్లాడుతున్నానో చూశారని తెలిపింది.

దక్షిణాదిలో ఈ విషయాన్ని పట్టించుకోరని.. ఏ భాషకు చెందినవారినైనా ఎంపిక చేసుకుంటారని తెలిపింది. తాను హిందీ సరిగ్గా మాట్లాడలేకపోయినందుకు ఎన్నో అవకాశాలు కోల్పోయానని చెప్పుకొచ్చింది.




