- Telugu News Photo Gallery Cinema photos Prashanth neel prabhas salaar 02 release date details know here
Salaar 02: డార్లింగ్ హింట్.. సలార్ 2 రిలీజ్ డేట్ ఫిక్సయిందా
సడన్‌గా ట్రెండ్ అవుతోంది సలార్. ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా డార్లింగ్ విష్ చేసిన తీరు వైరల్ అవుతోంది. ఆ కామెంట్స్ తో సలార్2 యమాగా ట్రెండ్ అవుతోంది. ఇంతకీ సలార్ సీక్వెల్‌ని ఎప్పుడు ఆశించవచ్చు..? ప్రభాస్ సినిమాలేవీ చెప్పిన తేదీకి ల్యాండ్ కావడం లేదు. వాయిదాల పర్వం నడుస్తోంది.
Updated on: Jun 06, 2025 | 7:35 PM

సడన్‌గా ట్రెండ్ అవుతోంది సలార్. ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా డార్లింగ్ విష్ చేసిన తీరు వైరల్ అవుతోంది. ఆ కామెంట్స్ తో సలార్2 యమాగా ట్రెండ్ అవుతోంది. ఇంతకీ సలార్ సీక్వెల్‌ని ఎప్పుడు ఆశించవచ్చు..?

ప్రభాస్ సినిమాలేవీ చెప్పిన తేదీకి ల్యాండ్ కావడం లేదు. వాయిదాల పర్వం నడుస్తోంది. ఇదే స్పీడు కంటిన్యూ అయితే ఆ ప్రభావం నెక్స్ట్ ఇయర్ మీద కూడా తప్పకుండా ఉంటుందనే మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

ఓ వైపు ఫౌజీ షెడ్యూల్స్ కంప్లీట్ అవుతున్నాయి. ఆ వెంటనే స్పిరిట్ ఎలాగూ సెట్స్ మీదకు వెళ్తుంది. ప్రభాస్, త్రిప్తి కాంబో సందీప్ రెడ్డి వంగా డైరక్షన్‌లో ఎలా ఉంటుందో చూడ్డానికి రెడీ అవుతున్నారు ఫ్యాన్స్.

ఇవన్నీ పూర్తి కాగానే సలార్ సెట్స్ కి వెళ్తారు ప్రభాస్. మై సలార్ అంటూ ప్రశాంత్ నీల్‌కి డార్లింగ్ బర్త్ డే విషెస్ చెప్పిన తీరు, ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది. సెకండ్ పార్టులో విధ్వంసం గ్యారంటీ అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది.

అటూ ఇటూగా ఉన్న డార్లింగ్ కెరీర్‌ని మళ్లీ దారిలో పెట్టిన సినిమా సలార్. ఫస్ట్ పార్టుతో పోలిస్తే శౌర్యాంగపర్వం నెక్స్ట్ లెవల్లో ఉంటుందని ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు నీల్. సెకండ్ పార్ట్ నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్‌లో స్టార్ట్ అయినా, 2027లో రిలీజ్ గ్యారంటీ అనే కేల్కులేషన్స్ కనిపిస్తున్నాయి ఇండస్ట్రీలో.




