- Telugu News Photo Gallery Cinema photos Netizens Trolls On Trisha After Kamal Haasan Thug Life Movie Release, Here is Reason
Trisha : సోషల్ మీడియాలో త్రిషపై దారుణంగా ట్రోల్స్.. కారణం ఇదే..
దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగాన్ని ఏలేస్తున్న హీరోయిన్ త్రిష. 42 ఏళ్ల వయసులోనూ చేతినిండా చిత్రాలతో దూసుకుపోతుంది. ఇప్పటికీ ఒక్కో సినిమాకు భారీగా పారితోషికం తీసుకుంటూ కుర్ర హీరోయిన్లకు చుక్కలు చూపిస్తుంది. కానీ తాజాగా సోషల్ మీడియాలో త్రిషపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఎందుకో తెలుసా.. ?
Updated on: Jun 06, 2025 | 2:37 PM

సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ త్రిష. సీనియర్ హీరోలతో ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు యంగ్ హీరోలకు సైతం జోడిగా నటిస్తుంది. రెండు దశాబ్దాలుగా వరుస సినిమాలతో వెండితెరపై మాయ చేస్తుంది ఈ అమ్మడు. తాజాగా థగ్ లైఫ్ మూవీలో నటించింది ఈ ముద్దుగుమ్మ.

ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియాలో త్రిష పై దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో నటించిన త్రిష.. ఇప్పుడు థగ్ లైఫ్ మూవీతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో కమల్ హాసన్, శింబు ముఖ్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

అయితే థగ్ లైఫ్ చిత్రంలో ఎందుకు నటించావ్ అంటూ త్రిషపై సీరియస్ అవుతున్నారు ఆమె ఫ్యాన్స్. అందుకు కారణం లేకపోలేదు. ఈ చిత్రంలో త్రిష ఇంద్రాణి అనే వేశ్య పాత్రలో నటించింది. త్రిష పాత్రకు, సినిమా కథకు అసలు సంబంధమే లేదు. కేవలం గ్లామర్ పాత్రకు మాత్రమే ఉపయోగించారు.

తనను బార్ డ్యాన్సర్ వృత్తి నుంచి కాపాడాడు అని శక్తిరాజు (కమల్ హాసన్ )తో ఉంటుంది. అప్పటికే అతడికి పెళ్లి కూడా జరుగుతుంది. కానీ ఆమె మీద అమర్ (శింబు) కన్ను పడుతుంది. శక్తిరాజును చంపేశానని చెప్పడంతో అతడితో వెళ్లిపోతుంది త్రిష. ఆ తర్వాత శక్తి రాజు తిరిగి వచ్చాడని తెలిసి సందేహంలో పడిపోతుంది.

ఈ సినిమాలో త్రిష పాత్రతో మణిరత్నం ఏం చెప్పాలని అనుకున్నారో అర్థం కాదు. ఆ పాత్రలో క్లారిటీ మిస్సయ్యింది. ఇలాంటి పాత్రను అసలు త్రిష ఎలా ఒప్పుకున్నారు.. ? అంటూ త్రిషపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు సినిమాలోని పాత్రకు ఎక్కువగా కనెక్ట్ కాకండి అంటూ ముందు నుంచి చెబుతుంది త్రిష.




