- Telugu News Photo Gallery Cinema photos #PrabhasHanu to Laila latest film updates from movie industry
Movie Updates: కారైకూడీకి ప్రభాస్ ప్రయాణం.. ఇచ్చుకుందాం బేబీ అంటూన్నా విశ్వక్..
కారైకూడీకి ప్రయాణం సాగిస్తున్న హీరో ప్రభాస్. ఇచ్చుకుందాం బేబీ అంటూన్నా విశ్వక్‌సేన్. విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వీర ధీర సూరన్. సైఫ్ అలీఖాన్‌ను హస్పిటల్‌కు చేర్చిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణాపై ప్రశంసలు కురిపిస్తున్నారు బాలీవుడ్ స్టార్స్. ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్లకు కూడా అవకాశాలు ఇవ్వాలంటున్నారు మనీషా కొయిరాలా.
Updated on: Jan 24, 2025 | 9:34 PM

ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్ కారైకూడి, మదురై ప్రాంతాల్లో జరగనుంది. ప్రభాస్‌తో పాటు ప్రధాన తారాగణం అంతా ఈ షూటింగ్‌లో పాల్గొంటారు.

లైలా మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. విశ్వక్‌సేన్ లేడీ గెటప్‌లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ నారాయణ్ దర్శకుడు. ఆకాంక్షశర్మ హీరోయిన్. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.

విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వీర ధీర సూరన్. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను తెలుగులోనూ భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మార్చి 27న తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ వీర ధీర సూరన్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

సైఫ్ అలీఖాన్‌ను హస్పిటల్‌కు చేర్చిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణాపై ప్రశంసలు కురిపిస్తున్నారు బాలీవుడ్ స్టార్స్. తాజాగా పంజాబీ గాయకుడు మికా సింగ్, భజన్ సింగ్‌కు లక్ష రూపాయల రివార్డు ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు మికా సింగ్.

ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్లకు కూడా అవకాశాలు ఇవ్వాలంటున్నారు మనీషా కొయిరాలా. గ్లామర్ ఇండస్ట్రీలో వయసవ్వటం అనేది ఓ సమస్యే కాదన్నారు ఈ బ్యూటీ. హీరోల వయసు విషయంలో జరగని చర్చ, హీరోయిన్ల విషయంలోనే ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారు.





























