- Telugu News Photo Gallery Cinema photos Prabhas The Raja Saabmovie release date update on 28 03 2025
The Raja Saab: ది రాజా సాబ్.. ఈ సమ్మర్‌కి పక్కా అనుకున్నారు కానీ..
ది రాజా సాబ్.. ఈ సమ్మర్‌కి పక్కా అనుకున్నారు. కానీ, ఇప్పుడు మాత్రం వెయిట్ చేయండి.. ఓపిక పట్టండి.. కంగారు పడకండి అనే మాటలు వినిపిస్తున్నాయి డార్లింగ్ ఫ్యాన్స్ కి. మేకర్స్ జస్ట్ ఆ మాటలతోనే ఊరుకుంటున్నారా? లేకుంటే ఇంకేదైనా హింట్ ఇస్తున్నారా? హాట్ సమ్మర్‌లో థియేటర్లలోకి ఎంట్రీ ఇస్తారనుకున్న రాజాసాబ్..
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Mar 28, 2025 | 7:31 PM

హాట్ సమ్మర్‌లో థియేటర్లలోకి ఎంట్రీ ఇస్తారనుకున్న రాజాసాబ్.. కూల్‌గా సారీ చెప్పేస్తున్నారు. పోస్ట్ పోన్ అవుతున్న వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉన్నా... అంతకు మించి ఊరించే మాటలున్నాయి ఇండస్ట్రీలో.

లేటెస్ట్ గా మైక్ అందుకున్నారు కెప్టెన్ మారుతి. విన్నారుగా అదీ సంగతి. ది రాజా సాబ్ ఎలా ఉంటుందో ఎవరూ బెంగ పెట్టుకోనక్కర్లేదన్నది మారుతి మాటల్లో వినిపించిన విషయం.

అంతే కాదు... తనతో ఎలాంటి సినిమా చేస్తే ప్రేక్షకులకు నచ్చుతుందో, అలాంటి సినిమానే డార్లింగ్ తీయిస్తున్నారని చెప్పారు. కంగారు పడకుండా ధైర్యంగా ఉంటే, ది బెస్ట్ ఔట్‌పుట్ వస్తుందన్నారు మారుతి.

ఆ మధ్య రాజా సాబ్ గురించి మాళవిక మోహనన్, తమన్ కూడా మాట్లాడారు. ప్రభాస్ సో స్వీట్ అంటూ మాళవిక కాంప్లిమెంట్స్ ఇస్తే, అప్పుడెప్పుడో ఇచ్చిన మ్యూజిక్ పాతదైపోయింది.

అందుకే ఫ్రెష్‌గా మళ్లీ ట్యూన్స్ కడుతున్నానన్నారు తమన్. వేసవిలో థియేటర్లలోకి రావాల్సిన సినిమా గురించి ఇలా టెక్నీషియన్స్ మాటల్లో వింటూ సర్దుకుంటున్నారు రెబల్ ఫ్యాన్స్.





























