AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజా సాబ్‌లో ప్రభాస్ ఇచ్చే సర్‌ప్రైజులు తెలిస్తే.. అభిమానులకు మతి పోతుంది

వరసగా ఫాంటసీ డ్రామాలు, భారీ యాక్షన్ థ్రిల్లర్స్ చేస్తున్న ప్రభాస్‌తో మారుతి ఎలాంటి సినిమా చేస్తున్నారు అంటూ చాలా రోజులుగా ఆసక్తిగా వేచి చూస్తున్నారు అభిమానులు. ముఖ్యంగా ఒకప్పట్లా డార్లింగ్ వేషాలు వేయిస్తున్నాడా లేదంటే ఈయన కూడా ఏదైనా విజువల్ వండర్ ప్లాన్ చేస్తున్నారా అని ఆరా తీస్తున్నరు వాళ్లు. ఫ్యాన్స్ ఆలోచనలకు, ప్రశ్నలకు ఇప్పటికే సమాధానం కూడా వచ్చేసింది.

Praveen Vadla
| Edited By: Phani CH|

Updated on: Jul 11, 2025 | 9:35 PM

Share
రాజా సాబ్‌లో అభిమానులు కోరుకునే అంశాలతో పాటు సర్‌ప్రైజులు కూడా చాలానే ఉండబోతున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్‌తో రెగ్యులర్ సినిమాలు చేయడమే మరిచిపోయారు దర్శకులు. ఆయన డేట్స్ ఇస్తే చాలు.. భారీ యాక్షన్ సినిమాలు లేదంటే లార్జర్ దెన్ లైఫ్ కారెక్టర్లు చేయిస్తూ ఒకప్పటి డార్లింగ్‌ను మర్చిపోయేలా చేసారు దర్శకులు.

1 / 5
మధ్యలో రాధే శ్యామ్‌లో లవర్ బాయ్‌లా కనిపించినా.. అందులోనూ భారీగా విజువల్ ఎఫెక్ట్స్ జొప్పించారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్.  సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి.. ఇలా ఏ సినిమా తీసుకున్నా బడ్జెట్ వందల కోట్లు పక్కా. ఇలాంటి సమయంలో కాస్త రిలీఫ్ కోసం చిన్న సినిమా చేయాలని అనుకున్నారు ప్రభాస్. అలా చేస్తున్నదే మారుతితో రాజా సాబ్.

2 / 5
మిగిలిన వాటితో పోల్చినపుడు ఇది చిన్న సినిమా అనిపిస్తుందేమో గానీ.. దీనికోసం కూడా 200 కోట్లు ఖర్చు చేస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. మంచి రోజులొచ్చాయి, పక్కా కమర్షియల్ ఫ్లాప్ అయినా.. మారుతిపై నమ్మకంతో రాజా సాబ్ చేస్తున్నారు ప్రభాస్. తనకు ఇచ్చిన ఆఫర్ వాడుకుంటూ.. ప్రభాస్‌ని నెవర్ బిఫోర్ అవతార్‌లో చూపిస్తున్నారు ఈ దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌లోనూ వింటే డార్లింగ్ కనిపిస్తున్నాడు.

3 / 5
సోషల్ మీడియాలో తాజాగా వస్తున్న ప్రభాస్ లుక్స్ కూడా సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. హార్రర్ కామెడీగా వస్తుంది రాజా సాబ్. ఈ సినిమాలో ప్రభాస్ కామెడీ టైమింగ్‌కు తోడు డాన్సులు కూడా హైలైట్ కానున్నాయి.

4 / 5
చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఈ సినిమాలో డాన్సులు చేయబోతున్నారు.. అంతేకాదు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడు.. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒకప్పటి ప్రభాస్‌ను ఈ సినిమా కోసం తీసుకొస్తున్నాడు మారుతి. 2025 డిసెంబర్ 5న విడుదల కానుంది ఈ చిత్రం. ఇందులో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

5 / 5