Spirit: స్పిరిట్‌పై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్
ప్రభాస్ సినిమాల విషయంలో కన్ఫ్యూజన్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. ఎవరికి వాళ్లు మా సినిమానే ముందు సెట్స్‌పైకి వెళ్తుందని చెప్తున్నారు కానీ ఏది ముందు పట్టాలెక్కుతుందనే విషయంపై కన్ఫ్యూజన్ తప్ప ఓ క్లారిటీ అయితే రావట్లేదు. ఇలాంటి సమయంలో స్పిరిట్ నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. మరి అదేంటి..?
Updated on: Jul 24, 2025 | 8:21 PM

ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో రాజా సాబ్ ఆల్రెడీ చివరిదశకు వచ్చేసింది.. ఫౌజీ షూట్ కూడా సగానికి పైగా పూర్తైంది. ఈ రెండింటి తర్వాత డార్లింగ్ నెక్ట్స్ చేయబోయే సినిమా ఏంటా అని చాలా రోజులుగా కన్ఫ్యూజన్ ఉండిపోయింది.

అయితే అలాంటిదేం అక్కర్లేదు.. ప్రభాస్ నెక్ట్స్ చేయబోయేది స్పిరిట్ అంటున్నారు మేకర్స్. సెప్టెంబర్ నుంచి స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని తెలుస్తుంది. మొన్నామధ్య నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా కూడా ఇదే చెప్పారు.

ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసారు సందీప్ వంగా. అంతేకాదు మెక్సికో సహా మరికొన్ని ఫారెన్ కంట్రీస్‌లో లొకేషన్స్ రెక్కీ కూడా అయిపోయింది. ఎక్కువ భాగం విదేశాల్లోనే షూట్ చేయబోతున్నారు మేకర్స్.

స్పిరిట్ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలైపోయాయి.. మూడు పాటలు కూడా కంపోజ్ చేసారు హర్షవర్ధన్ రామేశ్వర్. షూట్ కూడా ఒక్కసారి మొదలయ్యాక నో బ్రేక్స్ అంటున్నారు.

ఈ సినిమా కోసం ప్రభాస్ 90 రోజులు బల్క్ డేట్స్ ఇచ్చారని తెలుస్తుంది. 2026 సెకండాఫ్‌లో స్పిరిట్ విడుదల కానుంది. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్న ఈ చిత్రంలో త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్నారు.




