Pooja Hegde: అలాంటి సినిమాలు చేయాలని ఉంది.. ఓపెన్ అయిపోయిన పూజా హెగ్డే
చేసింది కొంచెమే. చేయాల్సింది చా...లా.. ఉంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏళ్లు ఫటాఫట్‌మని రోల్ అయిపోయాయి అంటూ పదేళ్లు దాటిన ప్రస్థానాన్ని రివ్యూకి పెట్టేశారు పూజా హెగ్డే. ఆమె యుటిలైజ్ చేసుకున్న కాలం కన్నా.. వేస్ట్ చేసుకున్న టైమే ఎక్కువని అంటున్నారు క్రిటిక్స్. పూజా హెగ్డే రీసెంట్ టైమ్స్ లో న్యూస్‌లో బాగా వినిపిస్తున్నారు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Feb 09, 2025 | 9:54 PM

పూజా హెగ్డే రీసెంట్ టైమ్స్ లో న్యూస్‌లో బాగా వినిపిస్తున్నారు. అల వైకుంఠపురములో సినిమాను తమిళ్ మూవీ అని చెప్పినప్పటి నుంచీ నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు అమ్మడిని.

అయినా అవేం పట్టించుకోవడం లేదు ఈ బ్యూటీ. పదేళ్లు దాటిన ప్రయాణంలో చాలా కేరక్టర్లు చేశాను.. ఇంకా చేయాల్సినవి బోలెడన్ని ఉన్నాయని అంటున్నారు.

తెలుగు స్క్రిప్టులను మిస్ పూజా ఎందుకు సెలక్ట్ చేసుకోవడం లేదు? ఆమెకు అసలు అవకాశాలే రావడం లేదా? వచ్చినా లైట్ తీసుకుంటున్నారా? అనే చర్చ ఓ వైపు జరుగుతూనే ఉంది.

అయితే వీటిని పట్టించుకోవడం లేదు సిల్వర్‌స్క్రీన్ అరవింద. కంప్లీట్ యాక్షన్ మూవీస్, తండ్రీ కూతుళ్ల అనుబంధంతో సాగే సినిమాలు, పిల్లల కోసం హ్యారీపోటర్ తరహా సినిమాలు చేయాలని ఉందని మాత్రం ఓపెన్ అయ్యారు పూజా హెగ్డే.

అంతేనా.. విష్ లిస్టులో ఇంకేమైనా మిగిలి ఉన్నాయా? అంటే సూపర్ మేన్ తరహా స్టోరీ వస్తే ఎగిరి గంతేసి చేస్తానని చెబుతున్నారు పూజా. ఆమె నటించిన దేవా ఇటీవల విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. సో ఇప్పటికి నార్త్ ఆశలు మానేసి, కోలీవుడ్‌కే కమిట్ కావాలనుకుంటున్నట్టున్నారు. సూర్యతో రెట్రో, దళపతి 69 ఈ బ్యూటీ చేతిలో ఉన్నాయి.





























