- Telugu News Photo Gallery Cinema photos Pawan Kalyan's Hari Hara Veera Mallu Shooting Update on 12 02 2025
Harihara veeramallu: హరిహరవీరమల్లు నుండి త్రిల్లింగ్ అప్‌డేట్.. సంతోషంలో అభిమానులు
మీరు మాట వినాలి... నేను ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి.. ఇప్పుడు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫాలో అవుతున్న పద్ధతి ఇదే. మరీ ముఖ్యంగా హరిహరవీరమల్లు లేటెస్ట్ అప్‌డేట్ విన్న వాళ్లందరూ దటీస్ పవర్‌స్టార్ అని మెచ్చుకుంటున్నారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అయితే సమ్మర్‌లో చూపిస్తాం మా తడాఖా అని ఒకింత గర్వంతో కాలర్ ఎగరేస్తున్నారు. ఇంతకీ విషయమేంటి?
Updated on: Feb 12, 2025 | 7:53 PM

ఎలక్షన్లకు ముందు అప్పుడెప్పుడో బ్రోతో పలకరించారు పవర్‌స్టార్. అప్పటి నుంచి ఆయన్ని రాజకీయ సభల్లోనూ, పాలనా పరమైన స్టేజ్‌ల మీద చూడటమే తప్ప, సినిమాల్లో చూడలేకపోతున్నారు ఆడియన్స్.

ఆ కొరత తీర్చడానికి ఈ సమ్మర్‌లో హరిహరవీరమల్లుని రిలీజ్ చేస్తున్నారు పవన్ కల్యాణ్. మార్చి 28న మా సేనాని వచ్చేస్తున్నారంటూ ఆల్రెడీ డేట్ మార్క్ చేసుకున్నారు అభిమానులు. దానికి తగ్గట్టే ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉన్నారు హరిహరవీరమల్లు మేకర్స్.

ఈ మధ్య రిలీజ్ అయిన మాట వినాలి పాట దూసుకుపోతోంది. మరోవైపు త్వరలోనే ఫోక్ సాంగ్‌ని వదలడానికి ప్రిపేర్ అవుతున్నారు. దీనికన్నా ఎగ్జయిటింగ్ విషయం ఒకటి ఇప్పుడు జనాలను ఊరిస్తోంది. వచ్చే వారంలో నాలుగు రోజులు కాల్షీట్ ఇచ్చారట పవర్‌స్టార్.

ఆ నాలుగు రోజులు షూటింగ్ చేస్తే, సినిమా మొత్తం పూర్తవుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్‌లోనే షూటింగ్‌ని కంటిన్యూ చేయాలా? లేకుంటే పవర్‌స్టార్‌కి అనుకూలంగా విజయవాడలో ప్లాన్ చేయాలా అనే చర్చలు జరుగుతున్నాయి.

ఫిబ్రవరిలోపు షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఓ కొలిక్కి తీసుకొచ్చేసి, మార్చి ఫస్ట్ వీక్‌కి మేం సంపూర్ణంగా రెడీ అని ప్రకటించాలన్నది యూనిట్ ఐడియా. పవర్‌స్టార్ కెరీర్‌లో ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి, ప్రమోషన్లను కూడా అదే రేంజ్‌లోనే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సో.. మార్చి 28న థియేటర్లలో కలుద్దాం అని కాన్ఫిడెంట్‌గా చెబుతోంది టీమ్.




