Pawan Kalyan: పవర్‌స్టార్‌ మేకప్‌ వేసుకునే డేట్‌ ఫిక్సయిందా ??

ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అభిమాన హీరో సినిమాను చూసి తీరుతామనే పట్టుదలతో ఉన్నారు పవర్‌స్టార్ ఫ్యాన్స్ . వాళ్ల ముచ్చటను తీర్చే సినిమాగా హరిహరవీరమల్లు థియేటర్లలోకి దూసుకురానుందా? ఈ డిసెంబర్‌లోపే రిలీజ్‌ డేట్‌ని ఫిక్స్ చేసుకుంటుందా? కెప్టెన్లు మారిన ఈ సినిమా విషయంలో ఏం జరుగుతోంది? హరిహరవీరమల్లు సినిమా మీద పవర్‌ ఫ్యాన్స్ కి స్పెషల్‌ ఫోకస్‌ ఎప్పుడూ ఉంటుంది. ఆయన కెరీర్‌లో ఫస్ట్ ప్యాన్‌ ఇండియా సినిమాగా ప్రకటించారు ఈ సినిమాను.

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Jul 18, 2024 | 8:03 PM

మీ వెనకే మేమూ ఉన్నాం అంటూ హరిహరవీరమల్లు అప్‌డేట్స్ తో సిద్ధమవుతున్నారు మేకర్స్. ఓటీటీ డీల్‌ ప్రకారం ఈ ఏడాదే విడుదల కావాలి హరిహరవీరమల్లు.

1 / 5
కానీ పరిస్థితుల దృష్ట్యా ఒన్లీ అప్‌డేట్స్ తోనే సరిపెడతారనే టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాలు రెండూ రిలీజ్‌ అయ్యాకే ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ వైపు చూస్తారు పవర్‌స్టార్‌. ఆ తర్వాత సురేందర్‌రెడ్డి సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.

2 / 5
ఎందుకో తెలియదు కానీ ఓజిపై ఉన్న అంచనాలు మరే సినిమాపై లేవేమో అనిపిస్తుంది. రాజకీయంగా పవన్ మరింత పవర్ ఫుల్‌గా మారడం.. అదే సమయంలో ఓజి వస్తుండటంతో ఆ ఎక్స్‌పెక్టేషన్స్ తారాస్థాయికి వెళ్లిపోయాయి.

3 / 5
హరిహరవీరమల్లు డిజిటల్‌ రైట్స్ ను ఆల్రెడీ విక్రయించేశారట మేకర్స్. ఆ డీల్‌ ప్రకారం చూసినా ఈ సినిమాను ఈ ఏడాది విడుదల చేసి తీరాల్సిన సిట్చువేషన్‌ కనిపిస్తోంది.  ఈ విషయాన్నే ప్రొడ్యూసర్‌ ఏ.ఎం.రత్నం ఇటీవల పవర్‌స్టార్‌కి వివరించారట. భారీ యాక్షన్‌ సీక్వెన్స్ తో పాటు, శ్రీనిధి శెట్టితో  ఓ పాటను కూడా చిత్రీకరిస్తే చాలా వరకు షూటింగ్‌ పూర్తయిపోతుందని చెప్పారట.

4 / 5
మరోవైపు ఓజీ సినిమా గురించి కూడా రీసెంట్‌గా పవన్‌కల్యాణ్‌ ప్రస్తావించారు. ఓజీ చూద్దురుగానీ, బావుంటుంది అని ఆయన ప్రకటించారు. సో, ఫస్ట్ వీరమల్లుని కంప్లీట్‌ చేసి ఓజీ సెట్స్ కి వెళ్తారా? లేకుంటే రెండిటికీ సైమల్‌టైనియస్‌గా కాల్షీట్లు ఇస్తారా? అనేది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది.

5 / 5
Follow us