- Telugu News Photo Gallery Cinema photos Pawan Kalyan OG To Kalyani Priyadarshan Lokah, These Are the Top 5 movies with the most views on OTT
Cinema : కాంతార చిత్రాన్ని వెనక్కు నెట్టిన చిన్న సినిమా.. ఓటీటీలో ఎక్కువ వ్యూస్ ఉన్న మూవీస్ ఇవే..
ఇటీవల కాలంలో ఓటీటీలో సినిమాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నప్పటికీ నెల రోజుల్లోనే డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సందడి చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఓటీటీలో అత్యధిక వ్యూస్ అందుకుని దూసుకుపోతున్న టాప్ 5 సినిమాలు ఏంటో తెలుసుకుందామా.
Updated on: Nov 09, 2025 | 9:53 PM

కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన ఇడ్లీ కడై సినిమా ఇప్పుడు ఓటీటీలో మొదటి స్థానంలో ఉంది. బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ ఇప్పుడు ఓటీటీలో దుసుకుపోతుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.71 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో దాదాపు 2 మిలియన్లు పైగా వ్యూస్ అందుకుంది.

పరమ సుందరి.. బాలీవుడ్ స్టార్స్ సిద్దార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటించిన సినిమా ఇది. రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు 2.8 మిలియన్ల వీక్షణలను పొందింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధానపాత్రలో డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన సినిమా ఓజీ. తెలుగుతోపాటు పాన్ ఇండియా లెవల్లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇప్పటివరకు 30 లక్షల వ్యూస్‌ను సాధించింది.

ఇక రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన సినిమా కాంతార చాప్టర్ 1. మొదటి భాగం విజయం సాధించిన తర్వాత, రెండవ భాగానికి కూడా భారీ స్పందన వచ్చింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు 35 లక్షల వీక్షణలను పొందింది.

ఇక చివరగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై థియేటర్లలో సంచలనం సృష్టించిన సినిమా లోక చాప్టర్ 1 చంద్ర. మలయాళంలో విడుదలై తర్వాత అన్ని భాషలలోకి డబ్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం ఈ మూవీ జియో హాట్ స్టార్ లో38 లక్షల వ్యూస్ అందుకుంది.




