Rajeev Rayala |
Updated on: Dec 11, 2021 | 9:58 PM
తెలుగు తమిళ్ అని తేడా లేకుండా నయనతార నాన్ స్టాప్ గా వరుస సినిమాలతో దూసుపోతోంది.
సినిమాకి సినిమాకి నయనతార పారితోషికం పెరిగిపోతోంది.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేయడంలో నయనతారకి తిరుగులేదు.
తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లో ఆమె స్టార్ హీరోయిన్ గా తన ప్రత్యేకతను చాటుకుంటోంది.
ఈ నేపథ్యంలోనే నయనతార కొత్త బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
డెర్మటాలజిస్ట్ అయినా రేణిత రాజన్ తో కలిసి ఆమె ఒక బ్యూటీ రిటైల్ బ్రాండ్ ను ప్రారంభించింది.
ఇలా నెమ్మదిగా తన వ్యాపారాలను విస్తరిస్తూ నయనతార ముందుకు వెళుతోంది.